Kavitha : ఎస్పారెస్పీ రెండో దశలో రెండు రిజర్వాయర్లు నిర్మించాలి

ఎస్పారెస్పీ రెండో దశ కింద ఉమ్మడి నల్లగొండ రైతులకు మేలు చేసేలా రెండు రిజర్వాయర్లు నిర్మించాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Kavitha : ఎస్పారెస్పీ రెండో దశలో రెండు రిజర్వాయర్లు నిర్మించాలి

విధాత : ఎస్పారెస్పీ రెండో దశ కాలువ కింద ఉమ్మడి నల్లగొండ జిల్లా రైతాంగానికి మేలు జరిగేలాలో రెండు రిజర్వాయర్లను కట్టాలని తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత ప్రభుత్వాన్ని కోరారు. జనం బాటలో భాగంగా తుంగతుర్తి, కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాలకు నీళ్లు ఇచ్చే ఎస్సార్ఎస్పీ స్టేజీ -2 కాల్వను పరిశీలించారు. వెలుగుపల్లి గ్రామంలోని రుద్రమ చెరువును పరిశీలించారు. ఈ సందర్బంగా కవిత మాట్లాడారు. రాష్ట్రంలో పంట కాల్వల మెయింటెనెన్స్ సరిగా లేదు అని. కాల్వల్లో కంప చెట్లు పెరిగాయని విమర్శించారు.

వీటి మెయింటెనెన్స్ కోసం బీఆర్ఎస్ కానీ, ఇప్పుడు ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం గానీ ఒక్కపైసా విడుదల చేయలేదు అని ఆరోపించారు. ఆపరేషన్ అండ్ మెయింటెనెన్స్ విభాగానికి కనీసం నిధులు ఇవ్వటం లేదు అన్నారు.

కోదాడ వరకు నీళ్లు ఇచ్చే డిస్ట్రిబ్యూటరీ కాల్వ 70 కిలోమీటర్లు ఉంటుందని, ఈ కాల్వను సరిగా మెయింటెన్ చేయటం లేదు అని కవిత విమర్శించారు. రుద్రమ దేవి చెరువును కింద 700 ఎకరాల్లో గోదావరి నీళ్లు రావాల్సి ఉందన్నారు. కానీ కిలోమీటర్ కు పైగా డిస్ట్రిబ్యూటరీ కాల్వ తవ్వకపోవటం కారణంగా గోదావరి నీళ్లు రావటం లేదు అని తెలిపారు. గత బీఆర్ఎస్ పెద్దలు ఈ చెరువును 5 టీఎంసీల రిజర్వాయర్ చేస్తామని రెండు ఎన్నికల్లో మాట ఇచ్చారు కాని చేయలేదన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా ఈ చెరువును లక్నవరం మాదిరిగా టూరిస్ట్ ప్లేస్ చేస్తామని మాట ఇచ్చిందని, ఇప్పటి వరకు ఈ చెరువును పట్టించుకోవటం లేదు అని విమర్శించారు.

ఇవి కూడా చదవండి :

Ayodhya Ram : బాలరాముడి దివ్య సుందర రూపం..చూడతరమా!
Nuclear Rockets | ఇకపై అణుశక్తితో దూసుకుపోనున్న రాకెట్లు? నష్టాలేంటి? లాభాలేంటి?