Revanth Reddy : హార్వర్డ్ విద్యార్థిగా సీఎం రేవంత్ రెడ్డి కొత్త చరిత్ర
సీఎం రేవంత్ రెడ్డి సరికొత్త రికార్డు! ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ యూనివర్సిటీలో 'లీడర్‌షిప్' కోర్సు కోసం విద్యార్థిగా ఎంపికయ్యారు. ఈ ఘనత సాధించిన తొలి భారతీయ ముఖ్యమంత్రిగా రేవంత్ చరిత్ర సృష్టించనున్నారు.
విధాత: తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి హార్వర్డ్ విద్యార్థిగా కొత్త చరిత్ర సృష్టించారు. అమెరికాలోని ప్రపంచ ప్రఖ్యాత హార్వర్డ్ విశ్వవిద్యాలయంలోని ‘కెనడీ స్కూల్ ఆఫ్ గవర్నమెంట్‌లో’ ప్రత్యేక విద్యా కోర్సుకు అటెండ్ కానున్నారు. ఈ మేరకు హార్వర్డ్ యూనివర్సిటీలో లీడర్ షిప్ ప్రోగ్రాంకు ఎన్ రోల్ అయ్యారు. స్వతంత్ర భారత్ లో ఈ ఘనత సాధించిన తొలి సీఎంగా రేవంత్ రెడ్డి చరిత్ర సృష్టించారు. భారతదేశ చరిత్రలో ఒక ఐవీ లీగ్ కార్యక్రమానికి హాజరవుతున్న మొదటి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానున్నారు. హార్వర్డ్ విద్యార్థిగా సీఎం రేవంత్ రెడ్డి 20 దేశాల ప్రతినిధులతో కలిసి గ్రూప్ ప్రాజెక్టులకు పాల్గొంటారు. కోర్స్ పూర్తయిన తర్వాత హార్వర్డ్ సర్టిఫికెట్ అందుకోనున్నారు.
“21వ శతాబ్దం కోసం నాయకత్వం” కోర్సు
మేడారం పర్యటన ముగిసిన వెంటనే సోమవారం దావోస్ పెట్టుబడుల సదస్సుకు వెళ్లిన సీఎం రేవంత్ రెడ్డి ఆ సదస్సు ముగిసిన తర్వాత.. ఈ నెల 23న అక్కడి నుంచి అమెరికాకు వెళతారు. హార్వర్డ్ కెనెడీ స్కూల్- ఎగ్జిక్యూటివ్ ఎడ్యుకేషన్ నిర్వహిస్తున్న వారం రోజుల కోర్సు .. “21వ శతాబ్దం కోసం నాయకత్వం(అస్తవ్యస్తత, సంఘర్షణ, ధైర్యం)” కోర్సు తరగతులకు రేవంత్ రెడ్డి హాజరవుతారు. ఈ కోర్స్ కోసం రేవంత్ రెడ్డి ఈ నెల 25 నుంచి 30 వరకు మసాచుసెట్స్‌లోని కెనడీ స్కూల్ క్యాంపస్‌లో ఉండి విద్యార్థిగా తరగతులకు హాజరవుతారు. 5 ఖండాలనుంచి 20 దేశాల ప్రతినిధులు ఈ కోర్సుకు హాజరు కాబోతున్నారు. వీరితో కలిసి రేవంత్ రెడ్డి తరగతులు, అసైన్‌మెంట్‌లు, హోమ్‌వర్క్‌లు పూర్తి చేసి గ్రూప్ ప్రాజెక్టులు కూడా నిర్వహిస్తారు. ఈ కోర్సుకు ప్రొఫెసర్ టిమ్ ఓ బ్రియాన్ ఛైర్మన్‌గా, ప్రొఫెసర్ కరెన్ మోరిసీ డైరెక్టర్‌గా వ్యవహరిస్తున్నారు.
ఈ కోర్సులో భాగంగా ప్రతినిధి బృందాలు ప్రపంచంలోని వివిధ ప్రాంతాలు, కాలాలు, తరాలనుండి కేస్ స్టడీలను విశ్లేషించి, పరిష్కారాలు రూపొందించి తరగతిలో సమర్పిస్తారు. కోర్స్ పూర్తి చేసిన తర్వాత ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి హార్వర్డ్ యూనివర్సిటీ నుంచి సర్టిఫికెట్ తీసుకొని అమెరికా నుంచి తిరుగు ప్రయాణమవుతారు. ఫిబ్రవరి 2న హైదరాబాద్‌కు చేరుకుంటారు.
ఇవి కూడా చదవండి :
Telangana Municipal Elections : మున్సిపల్ ఎన్నికలకు ఇన్‌చార్జ్‌లుగా మంత్రులు
Silver Gold Price|వెండి ధర కొత్త రికార్డు..పెరిగిన బంగారం ధరలు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram