Minister Jupalli | హైదరాబాద్‌లో చారిత్రక నాణేల జాతీయ సదస్సు.. బ్రోచర్ ఆవిష్కరించిన జూపల్లి
హైదరాబాద్ మరో జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ స్థాయిలో చారిత్రక నాణేల సదస్సు నిర్వహణకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 11, 12 తేదీల్లో 107వ వార్షిక జాతీయ నాణేల సదస్సు, సెమినార్‌ను రాష్ట్ర వారసత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు.
విధాత, హైదరాబాద్ :
హైదరాబాద్ మరో జాతీయ సదస్సుకు వేదిక కాబోతున్నది. తెలంగాణ రాష్ట్రంలో తొలిసారిగా జాతీయ స్థాయిలో చారిత్రక నాణేల సదస్సు నిర్వహణకు రంగం సిద్ధమైంది. డిసెంబర్ 11, 12 తేదీల్లో 107వ వార్షిక జాతీయ నాణేల సదస్సు, సెమినార్‌ను రాష్ట్ర వారసత్వ శాఖ ఆధ్వర్యంలో నిర్వహించనున్నారు. ఈ సదస్సు బ్రోచర్‌ను శుక్రవారం రాష్ట్ర సచివాలయంలో పర్యాటక, పురావస్తు శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు లాంఛనంగా ఆవిష్కరించారు.
న్యూమిస్మాటిక్ సొసైటీ ఆఫ్ ఇండియా (NSI) సహకారంతో తెలంగాణ వారసత్వ శాఖ సంయుక్తంగా ఈ ప్రతిష్టాత్మక సదస్సును నిర్వహిస్తోంది. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావం తరువాత నాణేల అధ్యయనంపై ఇంతటి ముఖ్యమైన జాతీయ స్థాయి కార్యక్రమం హైదరాబాద్‌లో జరగడం ఇదే మొదటిసారి కావడం విశేషం. ఈ సందర్భంగా మంత్రి జూపల్లి మాట్లాడుతూ.. నాణేల చరిత్ర ద్వారా తెలంగాణ రాష్ట్ర గొప్ప చారిత్రక, సాంస్కృతిక వైభవాన్ని దేశానికి చాటి చెప్పేందుకు ఈ సదస్సు దోహదపడుతుందని తెలిపారు.
జూబ్లీహిల్స్‌లోని డా.ఎంసీఆర్ హెచ్‌ఆర్‌డీ ఇన్‌స్టిట్యూట్‌లో డిసెంబర్ 11, 12 న రెండు రోజుల పాటు ఈ సదస్సు జరగనుంది. భారతదేశ నలుమూలల నుంచి విద్యార్థులు, స్కాలర్స్, పరిశోధకులు (రీసెర్చర్స్), న్యూమిస్‌మటిక్స్ నిపుణులు పాల్గొనే ఈ సదస్సు, నాణేల చారిత్రక, సాంస్కృతిక, కళాత్మక ప్రాముఖ్యతపై చర్చించేందుకు ఒక వేదికగా ఉపయోగపడనుందని భావిస్తున్నారు. ఈ కార్యక్రమంలో పర్యాటక, సాంస్కృతిక, పురావస్తు శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జయేష్ రంజన్, వారసత్వ శాఖ డైరెక్టర్ ప్రొఫెసర్ అర్జున్ రావు కుతాడి, డిప్యూటీ డైరెక్టర్లు డా. డి.రాములు, డా. పి. నాగరాజు పాల్గొన్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram