సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులు సాగిస్తున్న హెలికాప్టర్ ప్రయాణాలపై ప్రతిపక్షాలు అనేక విమర్శలు సంధిస్తున్నన్పటికి వారు మాత్రం హెలికాప్టర్ ప్రయాణాలపై వెనక్కి తగ్గడం లేదు. ఓ వైపు అప్పులు అంటూ మరోవైపు పాత హెలికాప్టర్ స్థానంలో సీఎం రేవంత్ రెడ్డి ప్రభుత్వం అత్యాధునిక AIRBUS H-160 హెలికాప్టర్‌ను అద్దెకు తీసుకోవడాన్ని తాజాగా ప్రతిపక్ష పార్టీలు ప్రశ్నించిన సంగతి తెలిసిందే. కొత్త హెలికాప్టర్ ను అద్దెకు తీసుకుంటే నెలకు రూ. 5 కోట్లు.. అదే కొనుగోలు చేస్తే రూ. 150- 160 కోట్లుగా ఉంటుందని..మరి అద్దెకు తెచ్చారా ?లేక కొనుగోలు చేశారా? అన్నదానిపై ప్రభుత్వం వెల్లడించాలని ప్రతిపక్షాలు కోరుతున్నాయి. ఏపీ సీఎం చంద్రబాబు వాడుతున్న మోడల్, అదే కంపెనీ నుంచి హెలికాప్టర్ రేవంత్ రెడ్డి కూడా కొత్త హెలికాప్టర్ ను తీసుకున్నట్లుగా సమాచారం.
అయితే సీఎం రేవంత్ రెడ్డి ముచ్చటపడి తెచ్చుకున్న కొత్త హెలికాప్టర్ ను కూడా మంత్రులు వదలడం లేదని, జిల్లాల పర్యటనకు కొత్త హెలికాప్టర్ ను కూడా వినియోగిస్తుండటం చర్చనీయాంశంమైంది. తాజాగా కొత్త హెలికాప్టర్ ను మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వినియోగించడం గమనార్హం.
రేవంత్ కొత్త మురిపెం తీరకముందే.. హెలికాప్టర్ ఎత్తుకెళ్లిన ఉత్తమ్..!!
ముఖ్యమంత్రి ముచ్చటపడి తెచ్చుకున్న రూ. 170 కోట్ల విలువైన AIRBUS H-160 హెలికాప్టర్‌ను నీళ్ల మంత్రి ఏసుకుని తిరుగుతుండు..
ఈ మంత్రులు కొంచెం కూడా ఎనక ముందు ఆలోచించరు..
పాత హెలికాప్టర్‌ను ఆటోలెక్క వాడుతున్నరనే… https://t.co/DZgHnO4aKC pic.twitter.com/NVXbfQkTjo
— Nayini Sharath Reddy (@Sharath_Nayini) June 11, 2026
