Bala Krishna | బాలయ్య కాళ్లు మొక్కిన హీరోయిన్.. ఆమె వినయానికి ఫిదా అయిన అభిమానులు
Bala Krishna | నటసింహం నందమూరి బాలకృష్ణ ఎక్కడ కనిపించినా అక్కడ సందడే అన్నట్లుగా ఉంటుంది. తాజాగా గుంటూరులోని లక్ష్మీపురంలో నిర్వహించిన ఓ ప్రముఖ జ్యువెల్లరీ షోరూమ్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యంగ్ బ్యూటీ డింపుల్ హయతి కూడా పాల్గొనడం విశేషంగా నిలిచింది.
Bala Krishna | నటసింహం నందమూరి బాలకృష్ణ ఎక్కడ కనిపించినా అక్కడ సందడే అన్నట్లుగా ఉంటుంది. తాజాగా గుంటూరులోని లక్ష్మీపురంలో నిర్వహించిన ఓ ప్రముఖ జ్యువెల్లరీ షోరూమ్ ప్రారంభోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ కార్యక్రమంలో యంగ్ బ్యూటీ డింపుల్ హయతి కూడా పాల్గొనడం విశేషంగా నిలిచింది.
ఈ ఈవెంట్ సందర్భంగా ఒక ఆసక్తికర సంఘటన చోటుచేసుకుంది. బాలకృష్ణను చూడగానే డింపుల్ హయాతీ ఎంతో వినయంతో ఆయన కాళ్లకు నమస్కరించి ఆశీర్వాదం తీసుకున్నారు. దీనికి స్పందించిన బాలయ్య ఆమె నెత్తిపై చేయి పెట్టి దీవించారు. సినీ పరిశ్రమలో సీనియర్ నటుల పట్ల యువత చూపిస్తున్న ఈ గౌరవం నెటిజన్లను ఎంతగానో ఆకట్టుకుంది. ఈ వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో విపరీతంగా వైరల్ అవుతున్నాయి.
హెలికాఫ్టర్‌లో ప్రయాణం..
ఇక ఈ ఈవెంట్ కోసం బాలయ్య, డింపుల్ కలిసి ప్రత్యేక హెలికాప్టర్‌లో ప్రయాణించడం కూడా హైలైట్‌గా మారింది. హెలికాప్టర్ వద్ద వీరిద్దరూ స్టైలిష్‌గా దిగిన ఫోటోలు అభిమానులను ఆకట్టుకున్నాయి. అయితే హెలికాప్టర్ లోపల జరిగిన ఒక చిన్న సంఘటన మరింతగా వైరల్ అవుతోంది. ప్రయాణ సమయంలో డింపుల్ సెల్ఫీ వీడియో తీస్తుండగా, పక్కనే ఉన్న బాలయ్య చిన్నపిల్లాడిలా అల్లరి చేస్తూ క్యూట్ ఎక్స్‌ప్రెషన్స్ ఇచ్చారు. సాధారణంగా గంభీరంగా కనిపించే బాలయ్య ఇలా సరదాగా కనిపించడంతో అభిమానులు ఫిదా అవుతున్నారు.
‘మా బాలయ్య బాబు ఎప్పుడూ ఎనర్జిటిక్‌గానే ఉంటారు’, ‘ఆయన మనసు చాలా సాఫ్ట్’ అంటూ అభిమానులు సోషల్ మీడియాలో కామెంట్ల వర్షం కురిపిస్తున్నారు.
కొత్త రూమర్స్..
ఇదిలా ఉంటే, బాలకృష్ణ – డింపుల్ హయాతీ కలిసి సినిమా చేస్తున్నారనే వార్తలు గతంలో వైరల్ అయిన విషయం తెలిసిందే. ముఖ్యంగా దర్శకుడు గోపీచంద్ మలినేని తెరకెక్కిస్తున్న ‘NBK 111’ చిత్రంలో డింపుల్ సెకండ్ హీరోయిన్‌గా నటిస్తుందనే ప్రచారం జరిగింది. అయితే ఈ వార్తలను దర్శకుడు తనదైన శైలిలో ఖండించారు. సోషల్ మీడియాలో ఒక ప్రసిద్ధ మీమ్ డైలాగ్‌ను షేర్ చేస్తూ ఈ వార్తల్లో ఎలాంటి నిజం లేదని స్పష్టం చేశారు.
తాజాగా ఈ ఈవెంట్‌లో వీరిద్దరూ కలిసి కనిపించడంతో ఆ పుకార్లు మళ్లీ చర్చకు వచ్చాయి. అయితే ప్రస్తుతం వీరిద్దరి మధ్య ఎలాంటి సినిమా ప్రాజెక్ట్ లేదని స్పష్టంగా తెలుస్తోంది. అయినప్పటికీ, గుంటూరులో జరిగిన ఈ ఈవెంట్ ద్వారా బాలయ్య, డింపుల్ జోడీ సోషల్ మీడియాలో హాట్ టాపిక్‌గా మారింది.
#Dimplehayathi blessed by our beloved #GodofMassesNBK ❤️❤️ pic.twitter.com/XDeBS9EEsR
— ᴹᵃʰᵃʳᵃᵃʲ Balayya Yuvasena (@BalayyaUvasena) April 16, 2026
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram