Passport Seva Kendras | బీ అలర్ట్.. హైదరాబాద్‌లో పాస్‌పోర్ట్ సేవా కేంద్రాలు మార్పు
Passport Seva Kendras | రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) నగరంలో సేవలందిస్తున్న పాస్ పోర్టు కేంద్రాల( Passport Seva Kendras ) నిర్వహణలో మార్పు చోటు చేసుకుంది. ప్రస్తుతం పాస్‌పోర్టు సేవలందిస్తున్న టోలీచౌకీ( Tolichowki ), అమీర్‌పేట( Ameerpeta ) పాస్ పోర్టు కేంద్రాలు.. వేరే ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయి.

Passport Seva Kendras | హైదరాబాద్ : రాష్ట్ర రాజధాని హైదరాబాద్( Hyderabad ) నగరంలో సేవలందిస్తున్న పాస్ పోర్టు కేంద్రాల( Passport Seva Kendras ) నిర్వహణలో మార్పు చోటు చేసుకుంది. ప్రస్తుతం పాస్‌పోర్టు సేవలందిస్తున్న టోలీచౌకీ( Tolichowki ), అమీర్‌పేట( Ameerpeta ) పాస్ పోర్టు కేంద్రాలు.. వేరే ప్రాంతాలకు తరలి వెళ్తున్నాయి.
అమీర్‌పేటలోని పాస్‌పోర్టు సేవా కేంద్రాన్ని ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్‌కు తరలిస్తున్నారు. షేక్‌పేట నాలా వద్ద ఉన్న టోలీచౌకీ పాస్ పోర్టు సేవా కేంద్రాన్ని రాయ్‌దుర్గం వద్ద ఓల్డ్ ముంబై రోడ్డులోని సిరి బిల్డింగ్‌కు తరలిస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. కొత్త కేంద్రాల్లో సెప్టెంబర్ 16వ తేదీ నుంచి పాస్‌పోర్టు సేవలు అందుబాటులోకి రానున్నాయి. ఇక బేగంపేటలోని పాస్ పోర్టు సేవా కేంద్రం ఎక్కడికి తరలించడం లేదు. ఇక్కడ్నే సేవలు కొనసాగనున్నాయి.
కొత్త పాస్ పోర్టు సేవా కేంద్రాలైన ఎంజీబీఎస్ మెట్రో స్టేషన్, రాయ్‌దుర్గంలోని సిరి బిల్డింగ్‌ను రిజీనల్ పాస్‌పోర్టు ఆఫీసర్ స్నేహజ సందర్శించారు. ఏర్పాట్ల విషయంలో అధికారులను అడిగి తెలుసుకున్నారు.