అమరావతి : తెలంగాణ భూమిపుత్రుల జాగీరు.. దాన్ని ఎవరూ కాదనరని, కానీ అందులోకి రానివ్వమని చెప్పడంపైనే అభ్యంతరం వ్యక్తం చేశానని జనసేన అధినేత, ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ ప్రశ్నించారు. బుధవారం అమరావతిలో పర్యటించిన ఆయన.. అక్కడి 58 అడుగుల అమరజీవి పొట్టి శ్రీరాములు కాంస్య విగ్రహాన్ని సందర్శించి నివాళులర్పించారు. అనంతరం మీడియాతో మాట్లాడారు. ఆంధ్రా నాయకులు ఎవరూ వెళ్లి తెలంగాణలో పోటీ చేయట్లేదు. తెలంగాణ భూమి పుత్రులే పోటీ చేస్తామంటే అభ్యంతరమేంటి? ఈ వ్యవహారం చినికి చినికి గాలివానలా మారింది. కుట్ర ఉందని నేను చెప్పలేను. విద్వేషాలకు ముగింపు పలకాలనేదే నా ఆలోచన అని పవన్ అన్నారు. గద్దర్ వంటి వారు ఎవరినీ తెలంగాణకు రావొద్దని మాట్లాడలేదు అని గుర్తు చేశారు. కేటీఆర్ కి నాకు బ్రదర్ రిలేషన్ ఉంది. ఆయనంటే నాకు ఇష్టం, నేనంటే ఆయనకు ఇష్టం. చాలా సందర్భాల్లో మేమిద్దరం కలిశాం. పాలసీల పరంగా విబేధాలు ఉండొచ్చేమో కానీ నా గురించి తప్పుగా అయితే ఏం మాట్లాడి ఉండరని, కేటీఆర్ ఏం మాట్లాడారో నేను వినలేదు అన్నారు.
నన్ను తెలంగాణలో అడుగుపెట్టనివ్వమంటేనే నేను మాట్లాడాల్సి వచ్చిందన్నారు. జనసేన సభకు అనుమతి ఇచ్చి ఉంటే ఇంత రచ్చ జరిగి ఉండేది కాదేమో అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఇదంతా కావాలనే చేసిందని నేను అనుకోవడం లేదు అన్నారు. ఏపీలో గత ప్రభుత్వం సభలు పెట్టనియ్యకపోతేనే కదా 11 సీట్లకు పడిపోయిందని, రౌడీయిజం చేస్తామంటే భయపడటానికి ఇక్కడెవరూ లేరు. రౌడీయిజానికి భయపడితే రాజకీయాలు చేస్తామా? అని మరోసారి స్పష్టం చేశారు. తెలంగాణ మన దేశంలో అంతర్భాగమే కదా అని, 2014 నుంచి 2024 వరకు ఎంతమంది తెలంగాణ కాంట్రాక్టర్లు ఏపీకి రాలేదు అని మరోసారి పవన్ పునరుద్ఘాటించారు.
తెలంగాణ ప్రజలను చూస్తుంటే ముచ్చటేస్తుంది
పొట్టి శ్రీరాములు త్యాగం వల్లనే భాషా ప్రయుక్త రాష్ట్రాలు ఏర్పడ్డాయని.. అలాంటి మహానాయకులను సైతం కులచట్రాల్లో బిగించడం రాజకీయాల్లో అలవాటుగా మారిందని పవన్ కల్యాణ్ అన్నారు.తెలంగాణ ప్రజలను చూస్తుంటే ముచ్చటేస్తుంది అని, తెలంగాణ ప్రజలకు తెలంగాణ అనే భావన ఉంటుంది.. కానీ ఆంధ్రావాళ్లకు ఏ భావన ఉందో ఎవరికీ తెలీదు అని, అది మన దురదృష్టం అన్నారు. తెలంగాణ వాళ్లకు తెలంగాణ అనే భావన ఉంటుంది అని, తమిళులకు తమిళం అనే భావన ఉంటుందని, ఆంధ్ర వాళ్లకు ఏ భావన ఉందో ఎవరికీ తెలియదని పవన్ కల్యాణ్ వ్యాఖ్యానించారు. ప్రాంతీయ వాదానికి, ప్రత్యేక రాష్ట్రానికి మధ్య తేదా ఉందన్నారు. తెలంగాణలో పార్టీ ఆఫీసు తీసేసినా నాయకులు, జనసైనికులు అలాగే ఉన్నారు. నిన్న జరిగిన పరిణామాలతోనే తెలంగాణలో పోటీపై ప్రకటన చేయాల్సి వచ్చింది. దేశ సమగ్రతకు భంగం కలిగించే దేన్నయినా గట్టిగా అడ్డుకుంటా. తెలంగాణ, గద్దర్ కుటుంబ సభ్యులపై నాకు గౌరవం ఉంది. తెలంగాణ కోసం పనిచేస్తాం అన్నారు.
వైసీపీ అధికారంలోకి వచ్చాక కులదూషణ పెరిగిందని, నిరుద్యోగం, అభివృద్ధి గురించి పట్టించుకోకుండా కులాల కుంపట్లు పెరిగాయని పవన్ కల్యాణ్ అన్నారు. ఈ వాతావరణాన్ని అడ్డుకునేందుకే సేనాగళం పేరుతో కమిటీ ఏర్పాటు చేశాం. ఇందులో అన్ని వర్గాల నాయకులు ఉంటారు. ఇష్టం వచ్చినట్లు మాట్లాడి కులం వెనుక దాక్కొనే సంస్కృతి వద్దు. వైఎస్ జగన్ మూడు రాజధానులు అన్నారని, ఇప్పుడు మూడు జిల్లాల మావిగన్ పేరు చెబుతున్నారని విమర్శించారు. 30వేల ఎకరాలతో పోయేదానికి మూడు జిల్లాలకు పెంచేశారని ఎద్దేవా చేశారు.
