పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించిన మహిళలు

కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.

విధాత, హైదరాబాద్ : కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కొడుకు భగీరథ్ ను వెంటనే అరెస్టు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ మహిళా కార్యకర్తలు పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌ను ముట్టడించి ఆందోళనకు దిగారు. సీఎం రేవంత్ రెడ్డి, బండి సంజయ్ లకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు.తప్పు చేసిన తన కుమారుడిని రక్షించేందుకు బండి సంజయ్ ప్రయత్నిస్తున్నారని, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డితో కుమ్మక్కై కేసును నీరుగార్చేలా వ్యవహరిస్తున్నారని బీఆర్ఎస్ మహిళా నేతలు ఆరోపించారు. నైతిక బాధ్యత వహిస్తూ బండి సంజయ్ తన మంత్రి పదవికి తక్షణమే రాజీనామా చేయాలని వారు డిమాండ్ చేశారు. బాధితురాలికి న్యాయం జరిగే వరకు తమ పోరాటం ఆపబోమని స్పష్టం చేశారు.

ఇప్పటికే బండి సంజయ్ కుమార్ కుమారుడు బండి సాయి భగీరథ్‌పై హైదరాబాద్‌లోని పేట్ బషీరాబాద్ పోలీస్ స్టేషన్‌లో పోక్సో (POCSO), బీఎన్ఎస్ (BNS) చట్టాల కింద కేసు నమోదైంది. 17 ఏళ్ల మైనర్ బాలికపై లైంగిక వేధింపులు, బెదిరింపులకు పాల్పడినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు ఈ కేసు నమోదు చేశారు.మొయినాబాద్‌లోని ఒక ఫామ్‌హౌస్‌లో మత్తుమందు ఇచ్చి బాలికపై అత్యాచారం, వేధింపులకు పాల్పడ్డాడని ఆమె తల్లి ఇచ్చిన ఫిర్యాదు మేరకు పేట్ బషీరాబాద్ పోలీసులు భగీరథ్‌పై కేసు నమోదు చేశారు.

అయితే బాలిక, ఆమె కుటుంబ సభ్యులు తనను హనీట్రాప్ చేసి రూ. 5 కోట్లు డిమాండ్ చేశారని, బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని భగీరథ్ కూడా మరోవైపు కరీంనగర్ పోలీసులకు మరో ఫిర్యాదు చేశారు. రెండు వర్గాల నుండి ఫిర్యాదులు అందడంతో పోలీసులు ఇరుపక్షాలపై ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసి విస్తృత దర్యాప్తు జరుపుతున్నారు.

Latest News