PJTSAU : ఆందోళన రేకెత్తిస్తున్న అగ్రికల్చర్ యూనివర్సిటీలో ఎగ్జామ్ పేపర్ లీక్
అగ్రికల్చర్ యూనివర్సిటీలో పేపర్ లీక్ కలకలం! నలుగురు ఉద్యోగులు సస్పెండ్ కాగా, 35 మంది విద్యార్థులపై వేటు పడింది. సర్కారుపై విపక్షాలు తీవ్ర విమర్శలు చేస్తున్నాయి.
విధాత, ప్రత్యేక ప్రతినిధి: ప్రొఫెసర్ జయశంకర్ అగ్రికల్చరల్ యూనివర్సిటీలో ఎగ్జామ్ పేపర్ లీకేజీ రేకెత్తిస్తోంది. బీఎస్సీ అగ్రికల్చర్ మూడో సంవత్సరం ఫస్ట్ సెమిస్టర్ పరీక్షల్లో క్వశ్చన్ పేపర్ లీకైన సంఘటనతో సంబంధిత అధికారులు ఒక్కసారిగా ఉలిక్కిపడ్డారు. ఈ ఘటనకు కారకులైన నలుగురు ఉద్యోగులను రాత్రికి రాత్రి సస్పెండ్ చేశారు. పేపర్ లీకేజీకి బాధ్యులుగా గుర్తిస్తూ ఈ చర్య తీసుకున్నారు.
వరంగల్ కేంద్రంగా లీక్
వరంగల్ కేంద్రంగా జరిగిన ఈ లీకేజీ సంఘటన జగిత్యాలలో వెలుగు చూసింది. తీగ లాగితే డొంక కదిలినట్లు లీకేజీకి యూనివర్సిటీ ఉద్యోగులు కారణమని ప్రాథమికంగా గుర్తించినట్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారంలో 35 మంది విద్యార్థుల ప్రవేశాలను రద్దు చేశారు. కొందరు ఏ ఈ ఓ లు తమ పదోన్నతి కోసం యూనివర్సిటీకి చెందిన జూనియర్ అసిస్టెంట్ సహకారంతో ఈ పేపర్ ను పొందినట్లు ప్రాథమిక సమాచారం. ఈ పేపర్ ను వారు తమ మిత్రులకు చేరవేయడంతో రాష్ట్రవ్యాప్తంగా పేపర్ లీక్ అయినట్లు భావిస్తున్నారు. ఈ వ్యవహారంపై ప్రభుత్వం సీరియస్ గా ఉన్నట్లు తెలుస్తోంది. విద్యాశాఖ మంత్రిగా బాధ్యతలు నిర్వహిస్తున్న సీఎం రేవంత్ రెడ్డి సంబంధిత అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేయడమే కాకుండా విచారణ వేగవంతం చేసి బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని ఆదేశించినట్లు తెలుస్తోంది. ఇదిలా ఉండగా ఈ లీక్ వ్యవహారంలో పెద్ద ఎత్తున డబ్బు వసూల్ చేసినట్లు కూడా అధికారులు గుర్తించారు.
సర్కారుపై విపక్షాల విమర్శలు
అగ్రికల్చర్ యూనివర్సిటీ ఎగ్జామ్ పేపర్ లీకేజీ సంఘటన ఇప్పుడు రాష్ట్రవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. అధికార పార్టీ ఆలోచనలోపడగా విపక్ష పార్టీల నేతలు విమర్శలు ఎక్కువ పెడుతున్నారు. పరీక్షల నిర్వహణలో ప్రభుత్వం ఫెయిల్ అయిందని విమర్శిస్తున్నారు. ఈ సంఘటన అప్పుడే రాజకీయ రంగు పులముకుంటుంది.
ఇవి కూడా చదవండి :
Bangalore | 2025లో మహిళలు మెచ్చిన బెస్ట్ సిటీగా బెంగళూరు.. హైదరాబాద్ స్థానం ఎంతంటే..?
Music Lollipop | మ్యూజిల్ లాలీపాప్.. తింటుంటే సంగీతం వస్తుందంట..!
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram