లావణ్యకు పోలీసుల నోటీసులు.. నాపై ఆరోపణలు అవాస్తవమని కొట్టిపారేసిన మాల్వీ
సినీ హీరో రాజ్‌తరుణ్‌పై తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన కోకాపేటకు చెందిన లావణ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు

విధాత : సినీ హీరో రాజ్‌తరుణ్‌పై తనను మోసం చేశాడని పోలీసులకు ఫిర్యాదు చేసిన కోకాపేటకు చెందిన లావణ్యకు పోలీసులు నోటీసులు జారీ చేశారు. ఆమె ఇచ్చిన ఫిర్యాదులో రాజ్ తరుణపైన, ఇతరులపైన చేసిన ఆరోపణలకు సంబంధించి నిర్ధిష్టమైన సమాచారం పేర్కోనలేదని, సదరు సమాచారాన్ని అందించాలని నోటీస్‌లో పేర్కోన్నారు. అయితే లావణ్య పోలీసులకు రాజ్‌తరుణ్‌పై ఫిర్యాదు చేసిన అనంతరం అందుబాటులో లేకుండా పోయింది. ఇప్పటికే లావణ్య తనపై చేసిన ఫిర్యాదులను రాజ్ తరుణ్ ఖండించారు. శనివారం ఈ వివాదంపై స్పందించిన నటి మాల్వీ మల్హోత్ర సైతం లావణ్య తనపై పోలీసు ఫిర్యాదులో చేసిన ఆరోపణలు తీవ్రంగా ఖండించారు.
లావణ్యతో తనకు పరిచయడం లేదని, రాజ్‌తరుణ్‌తో నాకు ఎలాంటి సంబంధం లేదని, కేవలం మేం సహనటులం మాత్రమేనని చెప్పారు. మేం కలిసి నటించిన సినిమా పూర్తయి ఆరు నెలలు అయ్యిందని, అప్పటి నుంచి నాకు అతను టచ్‌లో లేడని స్పష్టం చేసింది. తాను లావణ్యను బెదిరించలేదని ఆమె అనుమానంతో నాపై ఆరోపణలు చేసివుండవచ్చన్నారు. రాజ్ తరుణ్‌తో నటించిన ప్రతి హీరోయిన్‌ను ఆమె అనుమానిస్తుందని, వారి మధ్య గొడవతో నన్ను ఎందుకు లాగుతున్నారో అర్ధం కావడం లేదన్నారు. పోలీసులకు అవసరమైతే లావణ్య నుంచి నాకు వచ్చిన ఫోన్ కాల్స్, మేసెజ్‌ల వివరాలన్నింటిని అందచేస్తానని తెలిపారు.