జనసేన పార్టీ నాయకత్వం పట్ల అనుచిత వ్యాఖ్యల కేసు నేపథ్యంలో ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు మంగళవారం పర్సనల్ అడ్వోకేట్ తో కలిసి డీజీపీ సీవీ ఆనంద్ ను కలిశారు. తగిగ భద్రత కల్పించాలంటూ కోరారు.
కేంద్ర మంత్రి అమిత్ షా, పవన్ కల్యాణ్ భేటీపై ఓ టీవీ చానల్ చర్చలో నాగేశ్వర్ రావు చేసిన వ్యాఖ్యలు వివాదస్పదమయ్యాయి. వాస్తవానికి ఈ వివాదంలో ఇప్పటికే ప్రొఫెసర్ నాగేశ్వర్ రావు తన వ్యాఖ్యల పట్ల విచారం వ్యక్తం చేశారు. జనసేన పార్టీ నాయకత్వం కూడా వివాదానికి ముగింపు పలికిందని..ఇరువైపుల నుండి సమస్యకు ముగింపు పలికామని ఆయన ఎక్స్ లో ప్రకటించారు.
అయితే జనసేన నాయకుడు సిరంగు శ్రీనివాస్ రావు ఫిర్యాదుతో కాకినాడ పరిధిలోని ఇంద్రపాలెం పీఎస్ లో పలు సెక్షన్ల కింద నాగేశ్వర్ పై కేసులు నమోదయ్యాయి. ఆంధ్రా పోలీసులు వచ్చి అరెస్ట్ చేస్తారన్న వార్తల నేపథ్యంలో పోలీసులు హైదరాబాద్ లోని మణికొండలో ఆయన నివాసం వద్ద మోహరించారు. ఆంధ్రా పోలీసుల అరెస్టుకు సిద్ధమని ప్రొఫెసర్ నాగేశ్వర్ ఇప్పటికే ప్రకటించారు. మరోవైపు ఏపీ పోలీసులు నాగేశ్వర్ రావును అరెస్టు చేస్తే చంద్రబాబు నివాసాన్ని ముట్టడిస్తామని టీఆర్ఎస్ హెచ్చరించింది. భావప్రకటనా స్వేచ్ఛను గౌరవించాలని, కేసులను ఉపసంహరించాలని రాజకీయ వర్గాల డిమాండ్ చేస్తున్నాయి. ఈ క్రమంలో నాగేశ్వర్ రావు డీజీపీ సీవీ ఆనంద్ ను కలవడం గమనార్హం.
ఇవి కూడా చదవండి :
రైతుల కోసం హమాలీలకు రూ.10లక్షల 20వేల ఆర్థిక సహాయం: రాజగోపాల్ రెడ్డి
హైడ్రా ఆపరేషన్..కోకాపేట కొత్త చెరువులో ఆక్రమణల తొలగింపు
