కాంగ్రెస్ సీఎం, మంత్రుల మధ్య అవినీతి సొమ్ములలో వాటాల పంచాయతీ వ్యవహారమే మంత్రి కొండా సురేఖ వివాదానికి కారణం అని, కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని గోషామహాల్ ఎమ్మెల్యే రాజాసింగ్ విమర్శించారు. ఎక్స్ లో ఆయన ఈ మేరకు ఓ వీడియో విడుదల చేశారు. కొన్ని నెలల క్రితం మొదలైన వాటాల పంచాయతీ నేపథ్యంలో కొండా సురేఖను కేబినెట్ నుంచి తప్పించాలని, పార్టీ నుంచి వెళ్లగొట్టాలని ప్రయత్నాలు మొదలయ్యాయన్నారు. కొండా సుస్మిత వ్యాఖ్యలతో ఈ వివాదం ముదిరిపోయిందన్నారు. దీంతో కాంగ్రెస్ నేతల మధ్య దోపిడీ డబ్బుల వాటాల వ్యవహారం ఢిల్లీ పెద్దలకు తెలిసిందని, ఈ వ్యవహారమే కొండా సురేఖ రాజీనామా వరకు వెళ్లిందని ఆరోపించారు.
గత సీఎం కేసీఆర్ తెలంగాణను అప్పుల పాలు చేసి..అక్రమ సంపాదనతో ఫామ్ హౌస్ లో కూర్చున్నారన్నారు. ప్రజలకు మాయమాటలు, మోసపూరిత హామీలతో అధికారంలోకి వచ్చిన రేవంత్ రెడ్డి ప్రభుత్వం అవినీతి మయంగా మారిపోయిందని రాజాసింగ్ వ్యాఖ్యానించారు. ఈ ప్రభుత్వం ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియదు అని, అందుకే మంత్రులు, నాయకులు ఎవరి ఇష్టమొచ్చినట్టు దోచుకుంటున్నారని అన్నారు. మంత్రులు,పెద్ద నేతలు,చిన్న నేతలు,అధికారులనే తేడా లేకుండా అవినీతి నడుస్తోంది అని రాజాసింగ్ ఆరోపించారు.
🔥 కాంగ్రెస్లో కొత్త తమాషా అవినీతిపై ఎమ్మెల్యే రాజాసింగ్ సంచలన ఆరోపణలు
▪️ కాంగ్రెస్ ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయిందని, ఎప్పుడు కుప్పకూలుతుందో తెలియక ఇష్టమొచ్చినట్లు దోచుకుంటున్నారని ఎమ్మెల్యే రాజాసింగ్ @TigerRajaSingh ఆరోపించారు.
▪️ మంత్రులు, పెద్ద నేతలు, చిన్న నేతలు,… pic.twitter.com/eB8ss6faRx
— ముచ్చట్లు | Stories • Voices • Views (@muchatlu_) September 3, 2026
