బీసీలను మాత్రమే పదవుల నుంచి తొలగిస్తున్నారు: కేఏ పాల్ ఫైర్

క్రమశిక్షణ చర్యల పేరుతో బీసీలను మాత్రమే కాంగ్రెస్‌ పదవుల నుంచి తొలగిస్తోందని ప్రజాశాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్‌ ఆరోపించారు. కొండా సురేఖ వ్యవహారంపై కాంగ్రెస్‌ను ప్రశ్నించారు.

Reported by: Tejaswini Nanna | తెలంగాణ‌ | Sep 03, 2026, 1:46 pm IST
Read Time: 3 mins
బీసీలను మాత్రమే పదవుల నుంచి తొలగిస్తున్నారు: కేఏ పాల్ ఫైర్

క్రమశిక్షణా చర్యల పేరుతో బీసీలను మాత్రమే కాంగ్రెస్ హైకమాండ్ పదవుల నుంచి తొలగించడం అన్యాయంగా ఉందని ప్రజా శాంతి పార్టీ అధ్యక్షుడు కేఏ పాల్ మండిపడ్డారు. బీసీ మహిళ అయినందుకు కొండా సురేఖను పార్టీ నుండి తొలగిస్తున్నారని, అదే క్రమశిక్షణ చర్యలను రెడ్లకు మాత్రం వర్తింప చేయడం లేదని, వారిని పదవుల నుంచి తొలగించడం లేదని పాల్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కోమటిరెడ్డి అన్న దమ్ములు సీఎం రేవంత్ రెడ్డిని, పార్టీని తిట్టారని..కానీ ఎప్పుడైనా వారిని పార్టీ నుండి సస్పెండ్ చేశారా? అని ప్రశ్నించారు.

బీసీలు ఇప్పటికైనా మేల్కోనాలని, ప్యాకేజీ స్టార్ల మాదిరిగా అమ్ముడుపోకుండా స్వాభిమానంతో వ్యవహరించి ప్రజాశాంతి పార్టీలో చేరాలని పాల్ కోరారు. బడుగు, బలహీన వర్గాలకు ప్రాతినిధ్యం వహిస్తున్న ప్రజాశాంతి పాలనతోనే అప్పులు తీరి అభివృద్ది సాధ్యం అవుతుందన్నారు. గద్దర్, అంబేద్కర్ ల ఆశయాల సాధనకు పనిచేస్తున్న పార్టీతోనే బడుగు, బలహీన వర్గాలకు రాజ్యాధికారం సాధ్యం అవుతుందని, తెలుగు రాష్ట్రాల అభివృద్ధి జరుగుతుందని పాల్ స్పష్టం చేశారు.