Choutuppal | కెమికల్ ఫ్యాక్టరీలో పేలుడు..! ఇళ్లల్లో ప్రకంపనలు..!!
Choutuppal | యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని ఎల్లగిరిలో శుక్రవారం రాత్రి భయానక వాతావరణం ఏర్పడింది. అక్కడున్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోయింది.
Choutuppal | యాదాద్రి భువనగిరి జిల్లా చౌటుప్పల్ మండల పరిధిలోని ఎల్లగిరిలో శుక్రవారం రాత్రి భయానక వాతావరణం ఏర్పడింది. అక్కడున్న ఓ కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలిపోయింది. దీంతో పెద్ద ఎత్తున శబ్దాలు వెలువడ్డాయి. మంటలు ఎగిసిపడ్డాయి. దట్టమైన పొగలు కమ్ముకున్నాయి.
ఇక అదే సమయంలో సమీపంలో ఉన్న నివాసాల్లో భూమి ఒక్కసారిగా కంపించింది. దీంతో తీవ్ర భయాందోళనకు గురైన నివాసితులు భయంతో బయటకు పరుగులు తీశారు. రెండు సెకన్ల పాటు ప్రకంపనలు సంభవించడంతో ఏం జరుగుతుందో తెలియక ఆందోళనకు గురయ్యారు. భూమి కంపించడంతో.. తమ నివాసాల్లో ఉన్న వస్తువులన్నీ కూడా పడిపోయాయని స్థానికులు తెలిపారు.
అయితే భూ ప్రకంపనలు కెమికల్ ఫ్యాక్టరీలో రియాక్టర్ పేలడం కారణంగా సంభవించాయా..? లేదా..? అన్న విషయంపై స్పష్టత రావాల్సి ఉంది. ఈ ప్రమాద ఘటనకు సంబంధించి మరిన్ని వివరాలు తెలియాల్సి ఉంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram