నల్లగొండ జిల్లా చిట్యాల మండలం వెలిమినేడు నోచ్ ల్యాబ్స్‌లో రియాక్టర్ మరోసారి పేలింది. పేలుడు ధాటికి తొమ్మది మంది కార్మికులు గాయపడగా..ఒకరికి తీవ్ర గాయాలయ్యాయి. మూడో నెంబర్ రియాక్టర్ ఒక్కసారిగా పేలడంతో గాయపడిన కార్మికుడిని అత్యవసరంగా ఆసుపత్రికి తరలించారు. సెలవు రోజైన కార్మికుల దినోత్సవం మేడే రోజున కార్మికులతో యాజమాన్యం పనిచేయించడం మరో వివాదంగా మారింది. పేలుడు ధాటికి ఫ్యాక్టరీ పరిసరాల్లో భారీ శబ్ధం వినిపించింది.సమాచారం అందుకున్న వెంటనే పోలీసులు, అగ్నిమాపక సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు.
నెల రోజుల వ్యవధిలో రెండో పేలుడు
నెల రోజుల వ్యవధిలో ఇదే పరిశ్రమలో రెండోసారి రియాక్టర్ పేలడం గమనార్హం. గత నెల 9న రెండో నెంబర్ రియాక్టర్ పేలిన ఘటనలో ఒకరు మృతి చెందగా.. ఇద్దరికీ గాయపడ్డారు. నెల రోజుల్లోనే రెండోసారి పేలుడు జరుగడంతో వరుస ఘటనలతో కార్మికుల్లో భయం, ఆందోళన పెరిగిపోయింది.
పనికి వెళ్తే తిరిగి వస్తామో లేదోనన్న భయం కార్మికులను వేధిస్తుంది. భద్రతా ప్రమాణాలపై యాజమాన్యం నిర్లక్ష్యం వహిస్తుందని ఆరోపిస్తున్నారు. ప్రమాద స్థలానికి చేరుకున్న స్థానికులు పరిశ్రమ నిర్వాహకులపై ఆగ్రహావేశాలు వెళ్ళగక్కారు. పెద్ద ప్రమాదానికి ముందు హెచ్చరికగా మాదిరిగా ఈ రియక్టర్ల పేలుడు ఘటనలు కనిపిస్తున్నాయని, అధికారులు వెంటనే తనిఖీలు చేసి కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.
ఇవి కూడా చదవండి :
ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వానికి, విద్యార్థులకు హైకోర్టు షాక్..
కార్మికులకు అండగా టీఆర్ఎస్ : కవిత భరోసా
