Koonanneni Sambasivarao | సబిత వివాదాన్ని స్పీకర్ వద్ధ పరిష్కరించుకోండి …సీపీఐ ఎమ్మెల్యే కూనంనేని సూచన
సీఎం రేవంత్ రెడ్డికి సబితా ఇంద్రా రెడ్డికి అక్క ,తమ్ముళ్ల అనుబంధం ఉందని, వారి మధ్య నెలకొన్న వివాదాన్ని స్పీకర్ దగ్గర కూర్చొని పరిష్కరించుకుంటే మంచిదని సీపీఐ శాసన సభా పక్ష నేత కూనంనేని సాంబశివారావు సూచించారు.
విధాత,హైదరాబాద్ : సీఎం రేవంత్ రెడ్డికి సబితా ఇంద్రా రెడ్డికి అక్క ,తమ్ముళ్ల అనుబంధం ఉందని, వారి మధ్య నెలకొన్న వివాదాన్ని స్పీకర్ దగ్గర కూర్చొని పరిష్కరించుకుంటే మంచిదని సీపీఐ శాసన సభా పక్ష నేత కూనంనేని సాంబశివారావు సూచించారు. ఎస్సీ వర్గీకరణపై కూనంనేని సభలో మాట్లాడుతూఎస్సీ వర్గీకరణ విషయంలో సుప్రీంకోర్టు తీసుకున్న నిర్ణయాన్ని మనస్పూర్తిగ అభినందిస్తున్నామన్నారు. ఉద్యమానికి నాయకత్వం వహించిన మందకృష్ణ మాదిగకు అభినందనలు తెలుపుతున్నానన్నారు. రాష్ట్రాన్ని 10 సంవత్సరాల పరిపాలించిన బీఆరెస్ సభ్యులు సభలో కింద కూర్చోవడం బాధాకరమన్నారు. మహిళలను గౌరవించే వ్యక్తులలలో మొదటి వ్యక్తిగా ఉంటానని, ఈ వివాదాన్ని స్పీకర్ వద్ద పరిష్కరించుకోవాలని సూచించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram