Retired Employees Protest| రిటైర్డ్ ఉద్యోగుల అసెంబ్లీ ముట్టడి..ఉద్రిక్తత

తమ సమస్యల పరిష్కారానికి కోరుతూ రిటైర్డు ఉద్యోగులు సోమవారం అసెంబ్లీ ముట్టడితో ఆందోళన వ్యక్తం చేశారు. పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా రిటైర్డు ఉద్యోగులకు, పోలీసులకు మధ్య తోపులాట సాగింది.

Retired Employees Protest| రిటైర్డ్ ఉద్యోగుల అసెంబ్లీ ముట్టడి..ఉద్రిక్తత

విధాత, హైదరాబాద్ : తమ సమస్యల పరిష్కారానికి కోరుతూ రిటైర్డు ఉద్యోగులు( Retired Employees Protest) సోమవారం అసెంబ్లీ ముట్టడి(Assembly Siege)తో ఆందోళన వ్యక్తం చేశారు. పెన్షన్ దారులకు పాత బకాయిలు చెల్లించడం లేదని, పెండింగ్ లో ఉన్న డీఏలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ రాష్ట్రం నలుమూలల నుంచి వచ్చిన రిటైర్డు ఉద్యోగులు అసెంబ్లీ ముట్టడికి ప్రయత్నించారు. అయితే పోలీసులు వారిని అడ్డుకుని అరెస్టు చేసి పోలీస్ స్టేషన్లకు తరలించారు. ఈ సందర్భంగా రిటైర్డు ఉద్యోగులకు, పోలీసులకు మధ్య తోపులాట సాగింది.

ఆందోళన క్రమంలో రిటైర్డు ఉద్యోగులు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు.పెన్షన్ దారులకు బకాయిలు చెల్లించకుండా ప్రభుత్వం మొండి వైఖరిగా వ్యవహరిస్తుందని, పిల్లల పెళ్లిళ్లు చేయడానికి, వైద్య ఖర్చులకు డబ్బులు లేవని ఆవేదన వ్యక్తం చేశారు. దాదాపు రూ.3000 కోట్ల బకాయిలు పెండింగ్ లో ఉన్నాయని పెన్షన్ దారులు ఆందోళన వెలిబుచ్చారు. ప్రభుత్వం ఇప్పటికైనా వెంటనే బకాయిలను విడుదల చేయాలని డిమాండ్ చేశారు.