Revanth Reddy| సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ విమానం ట్రిప్ ఖరీదు రూ.80లక్షలు !?
తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనపై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అంతకంతకు ట్రోల్స్ పెరుగుతున్నాయి. సీఎంగా రెండేళ్ల వ్యవధిలో రేవంత్ రెడ్డి ఇప్పటిదాక 58వ సారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. ఢిల్లీలో సీజేఐ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం తతంగానికి.. సీఎం రేవంత్ రెడ్డి రూ.80 లక్షల ఖర్చు పెట్టి వెళ్లడం అవసరమా అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా ప్రశ్నిస్తుంది.
విధాత : తెలంగాణ సీఎం(Telangana CM) రేవంత్ రెడ్డి(Revanth Reddy)ఢిల్లీ పర్యటనల (Delhi Visit)పై బీఆర్ఎస్ సోషల్ మీడియాలో అంతకంతకు ట్రోల్స్ పెరుగుతున్నాయి. సీఎంగా రెండేళ్ల వ్యవధిలో రేవంత్ రెడ్డి ఇప్పటిదాక 58వ సారి ఢిల్లీ పర్యటనకు వెళ్లారు. సోమవారం ఆయన సుప్రీం కోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్ సూర్యకాంత్ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి హాజరయ్యేందుకు ఢిల్లీ వెళ్లారు. ఈ పర్యటన కోసం రేవంత్ రెడ్డి పెట్టిన (Delhi trip cost) ఖర్చు రూ.80లక్షలు అని బీఆర్ఎస్ సోషల్ మీడియా ట్రోలింగ్ చేస్తుంది. 8 నిమిషాల పాటు సాగిన సీజేఐ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం తతంగానికి.. సీఎం రేవంత్ రెడ్డి రూ.80 లక్షల ఖర్చు పెట్టి వెళ్లడం అవసరమా అంటూ ప్రశ్నిస్తుంది. ఓ వైపు అప్పుల రాష్ట్రం అని చెప్పుకుంటేనే..మరోవైపు ఎందుకీ ఢిల్లీ పర్యటనలు అంటూ నిలదీస్తుంది.
ఎకానమీ విమానంలో అతి సామాన్యుడిలాగా మా ముఖ్యమంత్రి ఢిల్లీకి వెళ్లొస్తారంటూ ఊదరగొట్టే కాంగ్రెసోళ్లకు రేవంత్ రెడ్డి ప్రత్యేక విమానంలో పోయింది కనిపిస్తలేదా.? అంటూ బీఆర్ఎస్ సోషల్ మీడియా చురకలేస్తుంది. సీజేఐ సూర్యకాంత్ ప్రమాణ స్వీకారం కార్యక్రమానికి దేశంలోని 28 రాష్ట్రాలు 3 కేంద్రపాలిత ప్రాంతాల ముఖ్యమంత్రుల్లో కేవలం ఇద్దరు మాత్రమే హాజరయ్యారని గుర్తు చేస్తుంది. జస్టిస్ సూర్యకాంత్ హర్యానా రాష్ట్రానికి చెందినవారు కాబట్టి, ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి హాజరయ్యాడని, మరొకరు తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అని పేర్కొంది. లోక్ సభలో ప్రతిపక్ష నేత అయ్యుండి కూడా రాహుల్ గాంధీ ఈ కార్యక్రమానికి హాజరు కాలేదు అని, అలాగే రాజ్య సభలో ప్రతిపక్ష నాయకుడైన, ఏఐసీసీ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా హాజరు కాలేదని ఎత్తి చూపుతూ..సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ పర్యటనలపై విమర్శలు సంధించింది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram