తెలంగాణ అభివృద్దికి సహకరించండి : మోదీకి సీఎం రేవంత్ రెడ్డి వినతి

వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా తెలంగాణ అభివృద్దికి కేంద్రం సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించారు. ప్రధాని మన్మోహన్ హయాంలో గుజరాత్ సీఎంగా ఉన్న మోదీకి కేంద్రం సహరించినట్లుగానే ఇప్పుడు తెలంగాణ అభివృద్దికి సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు.

విధాత, హైదరాబాద్ : వికసిత్ భారత్ లక్ష్య సాధనలో భాగంగా తెలంగాణ అభివృద్దికి కేంద్రం సహకరించాలని సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి విన్నవించారు. హెచ్ఐసీసీ(HICC) ప్రాంగణంలో రూ.9,377 కోట్ల అభివృద్ధి పనులకు ప్రధాని మోదీ శంకుస్థాపన, ప్రారంభోత్సవాలు చేశారు. ఈ సందర్బంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రధాని మన్మోహన్ హయాంలో గుజరాత్ సీఎంగా ఉన్న మోదీకి కేంద్రం సహరించినట్లుగానే ఇప్పుడు తెలంగాణ అభివృద్దికి సహకరించాలని రేవంత్ రెడ్డి కోరారు. దేశాన్ని అభివృద్ది చేస్తున్న ప్రధాని మోదీ తెలంగాణను కూడా అభివృద్ది చేయాలన్నారు.

ఎన్నికల తర్వాత అభివృద్ధి లక్ష్యంగా పనిచేయాల్సి ఉందని రేవంత్ రెడ్డి గుర్తు చేశారు. మూడు శాతం జనాభా ఉన్న తెలంగాణ 0శాతం పది శాతం ఎకనామిని లక్ష్యంగా పెట్టుకుందన్నారు. కేంద్రం 2047నాటికి 30ట్రిలియన్ల అభివృద్ది లక్ష్యంగా పెట్టుకుందే 2037 తెలంగాణ రైజింగ్ పేరుతో తెలంగాణ మూడు ట్రిలియన్ల అభివృద్ది లక్ష్యంగా పెట్టుకుందన తెలిపారు. వికసిత్ భారత్ లక్ష్య సాధనలో తెలంగాణ కూడా ముందుకు సాగేలా తెలంగాణకు మోదీ తన ఆశీర్వాదాలు సహకారం అందించాలని కోరుతున్నాం అన్నారు.

రాష్ట్రానికి సంబంధించి ఆర్ఆర్ఆర్, ఎలివేట్ కారిడార్లు, ఫ్యూచర్ సిటీ టూ మచిలీపట్నం పోర్టు ఎక్స్ ప్రెస్ హైవే, మెట్రో రెండు, మూడో దశల విస్తరణ అంటూ రెండు గంటల సమయం వెచ్చించి సమీక్షించి సింగిల్ విండో పద్దతిలో అనుమతులు ఇవ్వాలని కోరారు.

Latest News