డీలిమిటేషన్ పై.. ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్

డీలిమిటేషన్‌పై ప్రధాని మోదీకి సీఎం రేవంత్ రెడ్డి ట్వీట్ చేశారు. దక్షిణాది రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందని ఆందోళన వ్యక్తం చేస్తూ జీఎస్డీపీ ఆధారిత ఫార్ములాను సూచించారు.

విధాత, హైదరాబాద్ : డీలిమిటేషన్, మహిళా బిల్లు అంశాలపై తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి ప్రధాని నరేంద్ర మోదీకి ఎక్స్ వేదికగా గుర్తు చేశారు. డీలిమిటేషన్, మహిళా బిల్లు రెండు వేర్వేరు అంశాలని రేవంత్ రెడ్డి పేర్కొన్నారు. డీలిమిటేషన్‌తో దక్షిణాది రాష్ట్రాలతో పాటు చిన్న రాష్ట్రాలకు అన్యాయం జరుగుతుందంటూ ఆందోళన వ్యక్తం చేశారు. డీలిమిటేషన్‌తో బీజేపీకి తాత్కాలికింగా లాభం కల్గినా..దీర్ఘకాలంలో దేశానికి నష్టం చేకూరుతుందని రేవంత్ పేర్కొన్నారు. మహిళా కోటాను వెంటనే అమలు చేస్తే స్వాగతిస్తాం. కానీ మహిళా రిజర్వేషన్లను ఒక ముసుగుగా ఉపయోగించి జనాభా ఆధారితంగా లోక్‌సభ స్థానాల డీలిమిటేషన్‌ను ముందుకు తీసుకురావడం సరికాదన్నారు.

జీఎస్డీపీ ఆధారంగా డీలిమిటేషన్ చేయాలి

పార్టీ ప్రయోజనాల కంటే జాతీయ ప్రయోజనం ముఖ్యం అని గుర్తించి.. డిలిమిటేషన్‍కు ప్రత్యామ్నాయ మార్గాలు ఆలోచించాలని రేవంత్ రెడ్డి కోరారు. లోక్‍సభ నియోజకవర్గాల పునర్విభజనపై జాతీయ ఏకాభిప్రాయం అవసరం అని, ఈ విషయంలో అన్ని పార్టీలతో చర్చించాలని సూచించారు. ప్రత్యామ్నాయ నమూనాలను సైతం రేవంత్ రెడ్డి సూచించారు. డిలిమిటేషన్ కు జీఎస్డీపీ (రాష్ట్ర స్థూల ఉత్పత్తి) పార్ములాను సూచించారు. ప్రగతిశీల రాష్ట్రాలకు పొలిటికల్ డివిడెంట్ దక్కాలని 50-50 గ్రోత్ ఫార్ములాను సూచించారు.

ఇవి కూడా చదవండి :

మాజీ సీఎం కేసీఆర్‌కు మంత్రి సీతక్క లీగల్ నోటీసులు!
కొత్త చరిత్ర లిఖించబోతున్న భారత పార్లమెంట్: ప్రధాని మోదీ

Latest News