సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన వేముల రోహిత్ తల్లి

వేముల రోహిత్ తల్లి వేముల రాధిక శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. వేముల రోహిత్ ఎస్సీ కాదంటూ ఆయన, ఫేక్ సర్టిఫికెట్ ఆందోళనతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఆ కేసును పోలీసులు మూసేసిన వివాదంపై ఆమె సీఎంను కలిసి తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు

సీఎం రేవంత్‌రెడ్డిని కలిసిన వేముల రోహిత్ తల్లి

కేసు పునర్విచారణకు హామీ

విధాత, హైదరాబాద్ : వేముల రోహిత్ తల్లి వేముల రాధిక శనివారం సీఎం రేవంత్‌రెడ్డిని కలిశారు. వేముల రోహిత్ ఎస్సీ కాదంటూ ఆయన, ఫేక్ సర్టిఫికెట్ ఆందోళనతోనే ఆత్మహత్య చేసుకుని ఉంటాడని ఆ కేసును పోలీసులు మూసేసిన వివాదంపై ఆమె సీఎంను కలిసి తమకు న్యాయం జరిగేలా చూడాలని విజ్ఞప్తి చేశారు. ఈ కేసు పునర్విచారణ చేపట్టి న్యాయం జరిగేలా చూస్తామని సీఎం రేవంత్‌రెడ్డి హామీ ఇచ్చారు. రోహిత్‌ కేసు పునర్విచారణకు సీఎం హామీ ఇవ్వడం పట్ల వేముల రాధిక తన కృతజ్ఞతలు తెలిపారు.