కాంగ్రెస్ కక్షసాధింపు చర్యలతోనే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు: ఆర్.ఎస్.ప్రవీణ్ కుమార్

బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్, మాజీ ఎమ్మెల్యే పెద్ది సుదర్శన్ రెడ్డికి గుండెపోటు రావడానికి కాంగ్రెస్ ప్రభుత్వ వేధింపులే కారణమని ఆరోపించారు. కాంగ్రెస్ కక్షసాధింపు చర్యలపై తీవ్ర విమర్శలు చేశారు.

కాంగ్రెస్ ప్రభుత్వ పెద్దలదోపిడీ,అవినీతిని ప్రశ్నించినందున ప్రభుత్వ వేధింపులకు దిగడంతోనే బీఆర్‌ఎస్ జనరల్ సెక్రటరీ, నర్సంపేట మాజీ ఎమ్మెల్యే, పౌరసరఫరాల సంస్ధ మాజీ చైర్మన్ పెద్ది సుదర్శన్ రెడ్డిపై గుండెపోటుకు గురయ్యారని బీఆర్ఎస్ నేత ఆర్.ఎస్. ప్రవీణ్ కుమార్ తీవ్ర ఆరోపణలు చేశారు. పెద్ది సుదర్శన్ రెడ్డిపై వేధింపులలో భాగంగానే మొదట ఆయన ఆయుధ లైసెన్స్, సెక్యూరిటీ రద్దు చేసి,అక్రమ కేసులతో వేధింపులకు గురిచేయడం వల్లనే మానసికంగా ఒత్తిడికి గురై ఈ రోజు ఆసుపత్రిలో చావు బతుకుల మధ్య పోరాడుతున్నారని ఆరోపించారు. 52ఏళ్ల పెద్ది సుదర్శన్ రెడ్డి నిరంతరం వ్యాయమంతో శారీరకంగా ఆరోగ్యంగా ఉన్నారని, మద్యం పానం, మాంసం వంటి అలవాట్లు కూడా ఆయనకు లేవన్నారు.

సివిల్ సఫ్లయ్ సంస్థలో పనిచేసిన అనుభవంతో పెద్ది సుదర్శన్ రెడ్డి కాంగ్రెస్ హయాంలో ఆ సంస్థలో జరిగిన రూ.1,100కోట్ల కుంభకోణాన్ని బయటపెట్టారన్నారు. పౌర సరఫరాల శాఖ టెండర్లలో జరిగిన రూ.1,100 కోట్ల అవినీతిపై 715 పేజీల కీలక సాక్ష్యాధారాలతో కేంద్ర సంస్థలైన ఈడీ, సీబీఐలకు ఫిర్యాదు చేయడంతో పాటు .హైకోర్టులో ఆయన PIL దాఖలు చేశారని ప్రవీణ్ కుమార్ గుర్తు చేశారు. డీజీపీకి, ప్రభుత్వానికి లేఖలు రాశారని, మీడియా సమావేశాలు పెట్టారని, హైకోర్టు, సుప్రీంకోర్టులో పిటిషన్లు వేశారన్నారు. కిలో బియ్యం కూడా ఓ మిల్లు నుంచి ఇంకో మిల్లుకు పోకుండానే కాంగ్రెస్ పెద్దలు రూ.1,100కోట్లు కొల్లగొట్టారని పెద్ది బయటపెట్టారని అందుకే ఆయన పై వేధింపులు మొదలయ్యాయని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు.

అలాగే స్కుల్ ఎడ్యూకేషన్ డిపార్ట్ మెంటు లో రూ.17వేల రూపాయల బంకర్ బెడ్ ను రూ.33వేలకు కొనుగోలు చేసి తద్వారా వచ్చిన వందల కోట్ల రూపాయలను కాంగ్రెస్ పెద్దలు దోచుకుని, ఢిల్లీకి మూటలుగా పంపారని ఆధారాలతో సుదర్శన్ రెడ్డి బయటపెట్టాడని గుర్తుచేశారు. వాటిలో ఎక్కడ దొరికిపోతానోనన్న భయంతో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పెద్దలు సుదర్శన్ రెడ్డిపై కక్ష సాధింపులకు పాల్పడ్డారని..ముందుగా ఆయన రివాల్వార్ లైసెన్స్ ను నిలిపివేశారని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.

అలాగే సుదర్శన్ రెడ్డి సన్నిహితులైన కొందరు నర్సంపేట వ్యాపారస్తులు వట్టి నాగులపల్లిలో ఉన్న వారి భూమిని వాసవి బిల్డర్స్‌కు విక్రయించారు అని, ఆ భూమిపై ఇప్పుడు రేవంత్ రెడ్డి సన్నిహితుడైన ఫహీం ఖురేషీ అనే వ్యక్తి కన్ను పడిందని వెల్లడించారు. వాసవి బిల్డర్స్‌కు చెందిన విజయ్ కుమార్ తో కలిసి ఫహీం ఖురేషీ సైబరాబాద్ ఎకానమిక్ ఆఫైర్స్ వింగ్(EOW)లో ఆ వ్యాపారులపై అక్రమ కేసు నమోదు చేయించాడని, రోజు వ్యాపారులను పోలీస్ స్టేషన్‌కు పిలిపించి వేధించారని గుర్తు చేశారు.పెద్ది సుదర్శన్ రెడ్డి పేరును ఈ కేసులో చెప్పాలని ఆ వ్యాపారస్తులను ఫహీమ్ ఖురేషి ఒత్తిడి చేశాడని, ఆయనను కేసులో నిందితుడిగా చేర్చేందుకు ప్రయత్నించారని ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. ఈ విషయంపై పెద్ది సుదర్శన్ రెడ్డి గత పరిచయంతో డీజీపీ సీవీ ఆనంద్‌కు ఫోన్ చేయగా, ఈ విషయం నా చేతిలో ఏమీ లేదు అని, ఈ వ్యవహారాన్ని ఫహీం ఖురేషీ, ముఖ్యమంత్రి కార్యాలయం చూస్తున్నాయి” అని డీజీపీ అన్నట్టు సుదర్శన్ రెడ్డి తన సన్నిహితులకు చెప్పాడని ప్రవీణ్ కుమార్ తెలిపారు. సుదర్శన్ రెడ్డి సివిల్ సఫ్లయ్, బంకర్ బెడ్ ల కుంభకోణాలకు మాట్లాడకుండా, బీఆర్ఎస్ నుంచి బయటకు వస్తే తనపై ఎలాంటి వేధింపులు, కేసులు ఉండబోవని, ఆయుధ లైసెన్స్ రెన్యూవల్, సెక్యూరిటీ పునరుద్దరణ చేస్తామని కాంగ్రెస్ పెద్దలు రాయబారాలతో ఒత్తిళ్లకు గురి చేశారని ప్రవీణ్ కుమార్ వెల్లడించారు.

భద్రత కల్పనలో సెక్యూరిటీ కమిటీ వివక్షత

ప్రజాప్రతినిధులకు, నాయకులకు భద్రత కల్పించడంతో సెక్యూరిటీ కమిటీ వివక్షత ప్రదర్శిస్తుందని ఈ సందర్భంగా ప్రవీణ్ కుమార్ ఆరోపించారు. సెక్యూరిటీ రివ్యూ కమిటీ పారదర్శకంగా పనిచేస్తే పెద్ది సుదర్శన్ రెడ్డికి గన్ మెన్లను ఉపసంహరించి.. జానారెడ్డి,కొండా మురళి, జగ్గారెడ్డి, ఇంద్రకరణ్ రెడ్డి, మైనంపల్లి హనుమంత్ రావు, బీజేపీకి చెందిన పసునూరి దయాకర్, ఆచార్యలకు సెక్యూరిటీ ఎలా కొనసాగిస్తున్నారని? ప్రశ్నించారు.

సీఎం రేవంత్ రెడ్డి సోదరులైన అనుముల తిరుపతి రెడ్డి, కొండల్ రెడ్డి ,వరంగల్ లో రౌడీ షీటర్ గా పేరుగాంచిన నవీన్ రాజ్, కాంగ్రెస్ యూత్ ప్రెసిడెంట్ కు ఏ ప్రాతిపదికన డీజీపీ సెక్యూరిటీ కల్పించారు అని ప్రశ్నించారు. నక్సలిజం లేదని తెలిసి,ఎలాంటి ముప్పు లేనపుడు రాష్ట్ర మంత్రులకు బుల్లెట్ ప్రూఫ్ వాహనాలు ఎందుకు ఇస్తున్నారు? అని ప్రవీణ్ కుమార్ నిలదీశారు. కర్ణాటక, కేరళ,తమిళనాడు, మహారాష్ట్ర వంటి రాష్ట్రాల్లో మంత్రులకు ఈ సౌకర్యాలు లేవు కదా! అని గుర్తు చేశారు. రాష్ట్ర హోం మంత్రి, డీజీపీ ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాలని, లేదా లోపభూయిష్టంగా పని చేస్తున్న సెక్యూరిటీ రివ్యూ కమిటీని రద్దు చేయాలని డిమాండ్ చేశారు. సీఎం రేవంత్ రెడ్డి రేపు మాజీ ముఖ్యమంత్రి అయిన తర్వాత మా బీఆర్ఎస్ పార్టీ మీ భద్రత తగ్గించబోదని స్పష్టం చేశారు.

Latest News