Sangareddy : హవేలీ ఘన్‌పూర్‌లో తుపాకీ కలకలం
సంగారెడ్డి హవేలీ ఘన్‌పూర్‌లో భూవివాదంపై తుపాకీతో బెదిరింపు కలకలం రేపింది. చివరికి అది డమ్మీ గన్‌గా తేలింది.
విధాత : సంగారెడ్డి జిల్లా హవేలీ ఘన్ పూర్ లో తుపాకీతో బెదిరించిన వ్యవహారం కలకలం రేపింది. గ్రామానికి చెందిన హరినాథ్, ఎల్లం అనే ఇద్దరి మధ్య ఓ భూ వివాదం కొనసాగుతుంది. ఇటీవల పండించిన పంటకు సంబంధించి పంట కోతకు ఎల్లం కోర్టు అనుమతి పొందాడు. కోత పనులకు సిద్దమవ్వగా..హరినాథ్ అనుచరులు వచ్చి ఎల్లంను గన్‌తో బెదిరించారు.
అయితే చాకచక్యంగా ఎల్లం వారి నుంచి గన్ లాక్కొని పోలీసులకు సమాచారం అందించాడు. సమాచారం అందుకున్న పోలీసులు వెంటనే సంఘటన స్థలానికి చేరుకుని తుపాకీ స్వాదీనం చేసుకున్నారు. దర్యాప్తులో అది డమ్మీ గన్‌గా తేలింది. గన్ తో ఎల్లంపై బెదిరింపులకు పాల్పడిన విషయమై పోలీసులు కేసు నమోదు చేసుకుని నిందితుల కోసం గాలిస్తున్నారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram