DGP Shivadhar Reddy : కాల్పులు జరగలేదు

మణికొండలో ఎలాంటి కాల్పులు జరగలేదని డీజీపీ శివధర్ రెడ్డి స్పష్టం చేశారు. కే.ఈ.ప్రభాకర్–అభిషేక్ గౌడ్ మధ్య ఆస్తి వివాదం కొనసాగుతోంది.

DGP Shivadhar Reddy : కాల్పులు జరగలేదు

విధాత : రాయదుర్గం పీఎస్ పరిధిలోని మణికొండలో ఎలాంటి కాల్పులు జరగలేదని డీజీపీ శివధర్ రెడ్డి ప్రకటించారు. అక్కడ అక్కడ మామ అల్లుళ్ళ మధ్య పంచాయితీ నెలకొందన్నారు. ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి కెఈ ప్రభాకర్, ఆయన అల్లుడు అభిషేక్ గౌడ్ మధ్య ఆస్తి పంచాయితీ కొనసాగుతుందని వెల్లడించారు. ఈ నేపథ్యంలో
మాజీ మంత్రి ప్రభాకర్ తన అల్లుడు అభిషేక్ గౌడ్ పై ఫిర్యాదు చేశారని పేర్కొన్నారూ. గన్ పెట్టి బెదిరించాడని ప్రభాకర్ ఫిర్యాదు చేశారని తెలిపారు.

అల్లుడు అభిషేక్ గౌడ్ పై అక్టోబర్ 25 వ తేదీన రాయదుర్గం పీఎస్ లో కేసు నమోదు జరిగిందన్నారు. అభిషేక్ గౌడ్ పటాన్ చెర్వు మాజీ ఎమ్మెల్యే నందీ శ్వర్ గౌడ్ కుమారుడు అని తెలిపారు.