South Central Railway | రైల్వే ప్రయాణికులకు అలర్ట్.. శాతవాహన, పోర్‌బందర్ ఎక్స్‌ప్రెస్ రైళ్ల రూట్ మార్పు..
South Central Railway | దయచేసి వినండి.. శాతవాహన( Satavahana Express ), పోర్‌బందర్( Porbander Express ) ఎక్స్‌ప్రెస్ రైళ్ల రూట్ మారింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్( Secunderabad Railway Station ) నుంచి బయల్దేరాల్సిన ఈ రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. ఇక నుంచి కాచిగూడ(Kacheguda ), ఉందానగర్( Umdanagar ) రైల్వే స్టేషన్ల నుంచి బయల్దేరనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే( South Central Railway ) ప్రకటించింది.

South Central Railway | హైదరాబాద్ : దయచేసి వినండి.. శాతవాహన( Satavahana Express ), పోర్‌బందర్( Porbander Express ) ఎక్స్‌ప్రెస్ రైళ్ల రూట్ మారింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్( Secunderabad Railway Station ) నుంచి బయల్దేరాల్సిన ఈ రెండు ఎక్స్‌ప్రెస్ రైళ్లు.. ఇక నుంచి కాచిగూడ(Kacheguda ), ఉందానగర్( Umdanagar ) రైల్వే స్టేషన్ల నుంచి బయల్దేరనున్నట్లు దక్షిణ మధ్య రైల్వే( South Central Railway ) ప్రకటించింది. ఏప్రిల్ 15వ తేదీ నుంచి శాతవాహన ఎక్స్‌ప్రెస్ కాచిగూడ స్టేషన్ నుంచి, పోర్‌బందర్ ఎక్స్‌ప్రెస్ ఉందా నగర్ స్టేషన్ నుంచి రాకపోకలు కొనసాగించనున్నట్లు తెలిపింది. సికింద్రాబాద్ రైల్వే స్టేషన్‌లో అభివృద్ధి పనుల దృష్ట్యా రద్దీని తగ్గించేందుకు ఈ నిర్ణయం తీసుకున్నట్లు రైల్వే అధికారులు తెలిపారు. కొద్ది రోజుల వరకే ఈ మార్పు ఉంటుందని, తర్వాత ఈ రెండు రైళ్లు సికింద్రాబాద్ నుంచే రాకపోకలు కొనసాగిస్తాయని స్పష్టం చేశారు రైల్వే అధికారులు.
విజయవాడ – సికింద్రాబాద్ – విజయవాడ(12713/12714) శాతవాహన ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ స్టేషన్ నుంచి కాకుండా కాచిగూడ నుంచి బయల్దేరనుంది. పోర్‌బందర్ – సికింద్రాబాద్( 20968/20967) పోర్‌బందర్ ఎక్స్‌ప్రెస్ సికింద్రాబాద్ నుంచి కాకుండా ఉందానగర్ నుంచి బయల్దేరనుంది.
శాతవాహన ఎక్స్‌ప్రెస్ ( Satavahana Express )
శాతవాహన ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 15న ఉదయం 6.25కు విజయవాడలో బయల్దేరి మధ్యాహ్నం 12.55 గంటలకు కాచిగూడ చేరుకోనుంది. అదే రోజు సాయంత్రం 4 గంటలకు కాచిగూడలో బయల్దేరి రాత్రి 10.15 గంటలకు విజయవాడ చేరుకోనుంది శాతవాహన ఎక్స్‌ప్రెస్.
పోర్‌బందర్ ఎక్స్‌ప్రెస్ ( Porbander Express )
పోర్‌బందర్ ఎక్స్‌ప్రెస్ ఏప్రిల్ 15న తెల్లవారుజామున 1.15కు బయల్దేరి సికింద్రాబాద్, కాచిగూడ స్టేషన్ల మీదుగా ఉదయం 9.05 గంటలకు ఉందానగర్ చేరుకోనుంది. ఏప్రిల్ 16న రాత్రి మధ్యాహ్నం 2 గంటలకు ఉందానగర్ స్టేషన్‌లో పోర్‌బందర్ ఎక్స్‌ప్రెస్ బయల్దేరనుంది. ఈ రైలు కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల మీదుగా ప్రయాణించి రాత్రి 9.50 గంటలకు పోర్‌బందర్ చేరుకోనుంది.