Vande Bharat Sleeper | వందే భారత్‌ స్లీపర్‌ రైలు వచ్చేస్తున్నది..! తొలి రైలు కూతపెట్టేది హైదరాబాద్‌ నుంచే..!

Vande Bharat Sleeper | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో పరుగులు తీస్తున్న సెమీ హైస్పీడ్‌ రైళ్లకు ఫుల్‌ డిమాండ్‌ ఉన్నది. ఈ క్రమంలో రైల్వేశాఖ వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను తీసుకురాబోతున్నది. ప్రస్తుతం ఈ రైళ్లకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ బయటకు వచ్చింది.

Vande Bharat Sleeper | వందే భారత్‌ స్లీపర్‌ రైలు వచ్చేస్తున్నది..! తొలి రైలు కూతపెట్టేది హైదరాబాద్‌ నుంచే..!

Vande Bharat Sleeper | భారతీయ రైల్వే ప్రతిష్టాత్మకంగా వందే భారత్‌ రైళ్లను ప్రవేశపెట్టింది. దేశవ్యాప్తంగా వివిధ మార్గాల్లో పరుగులు తీస్తున్న సెమీ హైస్పీడ్‌ రైళ్లకు ఫుల్‌ డిమాండ్‌ ఉన్నది. ఈ క్రమంలో రైల్వేశాఖ వందే భారత్‌ స్లీపర్‌ రైళ్లను తీసుకురాబోతున్నది. ప్రస్తుతం ఈ రైళ్లకు సంబంధించిన కీలక అప్‌డేట్‌ బయటకు వచ్చింది. ఆగస్టు 15న తొలి వందే భారత్‌ స్లీపర్‌ రైలు పట్టాలెక్కనున్నట్లు అధికార వర్గాలు తెలిపాయి. ఈ అత్యాధునిక ప్రపంచ స్థాయి సదుపాయాలతో తీసుకురాబోతున్న స్లీపర్‌ తొలి రోజు దక్షిణ మధ్య రైల్వేకు కేటాయించినట్లు సమాచారం. సమాచారం మేరకు.. వందేభారత్ స్లీపర్ రైలును కాచిగూడ, సికింద్రాబాద్ స్టేషన్ల నుంచి ప్రారంభించే ఆలోచనలో దక్షిణ మధ్య రైల్వే ఉన్నట్లు తెలుస్తున్నది.

కాచిగూడ – విశాఖపట్నం, కాచిగూడ – తిరుపతి, సికింద్రాబాద్ – పుణే మధ్య వందేభారత్ స్లీపర్‌ రైలును ప్రారంభించేందుకు దక్షిణ మధ్య రైల్వే కసరత్తు చేస్తున్నది. కొత్త వందే భారత్ స్లీపర్ రైలులో 16 కోచ్‌లు ఉంటాయి. రైళ్లు కేవలం రాత్రి సమయాల్లో మాత్రమే నడిచే అవకాశం ఉంది. ఇందులో ఏసీ, నాన్ ఏసీ కోచ్‌లు ఉండనున్న సంగతి తెలిసిందే. టికెట్ ధరలు అందరికీ అందుబాటులో ఉంటాయని దక్షిణ మధ్య రైల్వే అధికారులు వెల్లడించారు. కొత్త వందే భారత్ స్లీపర్ గరిష్ఠంగా గంటకు 160 కిలోమీటర్ల వేగంతో నడిచే అవకాశం ఉంది. రైలు బయట డిజైన్‌ వందే భారత్‌ ఎక్స్‌ప్రెస్‌ను పోలి ఉంటుంది. ఈ రైలులో మొత్తం 16 కోచ్‌లలో ప్రయాణికులకు 823 బెర్త్‌లు ఉంటాయని అధికారులు చెబుతున్నారు. ఈ రైలులో ప్రయాణీకులకు విమానం లాంటి సౌకర్యాలు కల్పిస్తారు. భోజనం, తాగునీరు అందించేందుకు చిన్నగది ఉంటుంది.

వెలుపలి భాగంలో ఆటోమేటిక్ డోర్ ఇస్టమ్ ఉంటాయి. ఒడోర్‌లెస్ టాయ్‌లెట్స్ సౌకర్యాలతో ఉంటుంది. ట్రైన్ మొత్తం పూర్తిగా సౌండ్ ప్రూఫ్‌గా ఉండడంతో బయట నుంచి ఎలాంటి శబ్దాలు లోపలికి రావు. దాంతో రాత్రి సమయంలో ప్రయాణికులు హాయిగా నిద్రించేందుకు అవకాశం దొరకనున్నది. అదే సమయంలో వందే భారత్‌ మెట్రో సైతం ప్రారంభించేందుకు రైల్వేశాఖ కసరత్తు చేస్తున్నది. ఈ రైళ్లు కాన్పూర్ – లక్నో, ఢిల్లీ – మీరట్, ముంబయి – లోనావాలా, వారణాసి – ప్రయాగ్‌రాజ్, పూరి – భువనేశ్వర్, ఆగ్రా – మథుర మధ్య నడిచే అవకాశం ఉన్నది. ఒక్కో కోచ్‌లో 250 మంది సులభంగా ప్రయాణించవచ్చని తెలుస్తున్నది. వందే భారత్ మెట్రో రైలు ట్రయల్ రన్‌ను త్వరలో రైల్వే నిర్వహించనున్నది.