School Bus Accident| శంషాబాద్ సమీపంలో స్కూల్ బస్సు బోల్తా
శంషాబాద్ సమీపంలో ఓ స్కూల్ బస్సు బోల్తా కొట్టింది. ముందున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బస్సులో 60మంది విద్యార్ధులు ఉన్నారు. వారిలో పలువురికి గాయాలయ్యాయి.
విధాత, హైదరాబాద్ : శంషాబాద్ (Shamshabad)సమీపంలో ఓ స్కూల్ బస్సు బోల్తా(School Bus Accident) కొట్టింది. ముందున్న వాహనాన్ని తప్పించబోయే క్రమంలో బస్సు అదుపు తప్పి బోల్తా పడింది. బస్సులో 60మంది విద్యార్ధులు ఉన్నారు. వారిలో పలువురికి గాయాలయ్యాయి. గాయపడిన విద్యార్థులను వెంటనే సమీప ఆసుపత్రుల్లోకి తరలించారు.
రిషి హైస్కూల్ కు చెందిన బస్సు విద్యార్ధులతో శంషాబాద్ నుంచి జలవిహార్ వెళ్తుండగా ప్రమాదానికి గురైంది. రోడ్డుపై బస్సు అడ్డంగా పడిపోవడంతో ట్రాఫిక్ స్తంభించింది. వెంటనే ట్రాఫిక్ పోలీసులు క్రేన్ల సహాయంతో బస్సును పక్కకు జరిపి ట్రాఫిక్ పునరుద్దరించారు. ఈ ప్రమాదంతో విద్యార్ధులు భయాందోళనకు గురయ్యారు. ప్రమాద సమాచారం తెలుసుకున్న పిల్లల తల్లిదండ్రులు తమ పిల్లలకు ఏమైందోనన్న ఆందోళనతో ఆసుపత్రులకు పరుగులు తీశారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram