TGSRTC | ఈ 11 ఆర్టీసీ డిపోల డ్రైవర్లకు షాకింగ్ న్యూస్.. సెల్‌ఫోన్ వాడకంపై నిషేధం..
TGSRTC | ఆర్టీసీ బస్సుల్లో( RTC Bus ) ప్రయాణాల్లో సురక్షితం.. ఈ సూక్తిని ప్రతి ఆర్టీసీ బస్టాండ్( RTC Bustand )లో, ప్రతి ఆర్టీసీ బస్సులో చూస్తుంటాం. ఆ నియమానికి అనుగుణంగానే ఆర్టీసీ ప్రయాణికులకు( RTC Passengers ) సేవలందిస్తోంది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే పరమావధిగా టీజీఎస్ ఆర్టీసీ( TGSRTC ) ముందుకు సాగుతోంది.

TGSRTC | హైదరాబాద్ : ఆర్టీసీ బస్సుల్లో( RTC Bus ) ప్రయాణాల్లో సురక్షితం.. ఈ సూక్తిని ప్రతి ఆర్టీసీ బస్టాండ్( RTC Bustand )లో, ప్రతి ఆర్టీసీ బస్సులో చూస్తుంటాం. ఆ నియమానికి అనుగుణంగానే ఆర్టీసీ ప్రయాణికులకు( RTC Passengers ) సేవలందిస్తోంది. ప్రయాణికులను సురక్షితంగా గమ్యస్థానాలకు చేర్చడమే పరమావధిగా టీజీఎస్ ఆర్టీసీ( TGSRTC ) ముందుకు సాగుతోంది.
అయితే ప్రమాదాలను నిలువరించేందుకు టీజీఎస్ ఆర్టీసీ( TGSRTC ) కీలకం నిర్ణయం తీసుకుంది. కొన్ని సందర్భాల్లో ఆర్టీసీ డ్రైవర్‌లు( RTC Drivers ) బస్సు డ్రైవింగ్ చేస్తూ ఫోన్లు మాట్లాడడం కారణంగా ప్రమాదాలు చోటు చేసుకున్న ఘటనలు ఉన్నాయి. ఈ ప్రమాదాలకు అడ్డుకట్ట వేయాలనే ఉద్దేశంతో.. విధి నిర్వహణలో ఉన్న డ్రైవర్ల వద్ద సెల్‌ఫోన్లు( Cell Phones ) ఉండకూడదని నిర్ణయం తీసుకుంది ఆర్టీసీ. ఈ మేరకు టీజీఎస్ ఆర్టీసీ ఉత్తర్వులు జారీ చేసింది. ఈ విధానం నేటి నుంచి అంటే సెప్టెంబర్ 1 నుంచి అమల్లోకి రానుంది.
ఈ విధానాన్ని అమలు చేసేందుకు ఆర్టీసీ కార్పొరేషన్ పరిధిలోని 11 రీజియన్ల నుంచి ఒక్కో డిపోను పైలట్ ప్రాజెక్టు కింద ఎంపిక చేశారు. ఒక వేళ ఈ ప్రాజెక్టు విజయవంతమైతే దశల వారీగా అన్ని డిపోల్లో అమలు చేయనున్నారు. ఇక డ్రైవర్ విధుల్లో చేరే ముందు తన సెల్‌ఫోన్‌ను డిపోలోని సెక్యూరిటీ ఆఫీసర్ వద్ద డిపాజిట్ చేయాల్సి ఉంటుంది. మళ్లీ విధులు ముగించుకున్న తర్వాత సెల్‌ఫోన్‌ను తిరిగి పొందేందుకు డ్రైవర్లకు వీలు కల్పించారు.
అత్యవసర సమయాల్లో కుటుంబ సభ్యులు సదరు డ్రైవర్‌తో మాట్లాడాలనుకుంటే.. డిపోల్లో ప్రత్యేకంగా ఏర్పాటు చేసిన సెల్‌ఫోన్ నంబర్‌కు కాల్ చేయాల్సి ఉంటుంది. తద్వారా ఆ బస్సు కండక్టర్ ద్వారా డ్రైవర్‌కు సమాచారం అందించి ఫోన్ మాట్లాడిస్తారు.
సెల్‌ఫోన్ నిషేధం ఈ డిపోల్లో అమలు..
ఫరూక్‌నగర్ (హైదరాబాద్)
కూకట్‌పల్లి (సికింద్రాబాద్)
కొల్లాపూర్ (మహబూబ్‌నగర్)
సంగారెడ్డి (మెదక్)
మిర్యాలగూడ (నల్లగొండ)
వికారాబాద్ (రంగారెడ్డి)
ఉట్నూర్ (ఆదిలాబాద్)
జగిత్యాల (కరీంనగర్)
ఖమ్మం (ఖమ్మం)
కామారెడ్డి (నిజామాబాద్)
పరకాల (వరంగల్)