సింగూర్ డ్యామ్ నుంచి నీటి విడుదల

గేట్లు ఎత్తి..పూజలు చేసిన మంత్రి దామోదర రాజనరసింహ
విధాత : ఆయకట్టు పంటల సాగుకు వీలుగా సింగూరు డ్యామ్ నుంచి నీటిని విడుదలను ప్రారంభించారు. రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి దామోదర రాజనర్సింహ సింగూరు ఎడమ కాలువ నుంచి సాగు కోసం 100 క్యూసెక్కుల నీటిని విడుదల చేశారు. గెట్లు ఎత్తి, గంగమ్మ తల్లికి ప్రత్యేక పూజలు చేశారు. రెండు పంటల క్రాప్ హాలిడే తర్వాత సింగూర్ డ్యామ్ ఆయకట్టుకు నీటిని విడుదల చేశారు. సింగూరు ఎడమ కాలువ మరమ్మతుల నేపథ్యంలో రెండు పంటలకు క్రాప్ హాలిడే ప్రకటించారు. రైతులు పంట సాగు ఇబ్బందుల దృష్ట్యా ఈ ఏడాది పంటల సాగుకు నీటిని విడుదల చేశారు.