తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు సోనియాగాంధీ గైర్హాజర్
రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు సోనియాగాంధీ హాజరు కావడం లేదని గాంధీభవన్ వర్గాలు స్పష్టత ఇచ్చాయి.
అనారోగ్య కారణాలే కారణమన్న కాంగ్రెస్ వర్గాలు
విధాత : రాష్ట్ర ఆవిర్భావ దశాబ్ది ఉత్సవాల ముగింపు వేడుకలకు సోనియాగాంధీ హాజరు కావడం లేదని గాంధీభవన్ వర్గాలు స్పష్టత ఇచ్చాయి. అనారోగ్యం, ఎండల కారణంగా వైద్యులు చేసిన సూచన మేరకు ఆమె తన తెలంగాణ పర్యటనను రద్దు చేసుకున్నారని వెల్లడించాయి. తెలంగాణ ప్రజలకు వీడియో సందేశాన్ని వినిపించనున్నారు.
ఆ మెసేజ్ ను పరేడ్ గ్రౌండ్స్ వేదిక మీద భారీ ఎల్‌ఈడీ స్క్రీన్ ద్వారా సీఎం రేవంత్ రెడ్డి ప్రజలకు వివరించనున్నారని తెలిపాయి. రాష్ట్ర అవతరణ ఉత్సవాలకు తెలంగాణ ఇచ్చిన సోనియాగాంధీ హాజరుకావాలంటూ సీఎం రేవంత్‌రెడ్డి ఆమెను ఆహ్వానించారు. ఆమె అందుకు సానుకూలంగా స్పందించినప్పటికి, అనారోగ్య కారణాలు, వైద్యుల సూచనలతో తెలంగాణ పర్యటన రద్దు చేసుకున్నట్లుగా సమాచారం.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram