Sonia Gandhi | ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేరుస్తుంది

తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కలలను నెరవేర్చే బాధ్యత తమపై ఉందని, సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలిపారు

  • By: Somu |    telangana |    Published on : Jun 02, 2024 1:38 PM IST
Sonia Gandhi | ప్రజల ఆకాంక్షలను కాంగ్రెస్ నెరవేరుస్తుంది

రాష్ట్ర ఆవిర్భావ వేడుకల్లో సోనియాగాంధీ సందేశం

విధాత, హైదరాబాద్ : తెలంగాణ ప్రజల ఆకాంక్షలను, కలలను నెరవేర్చే బాధ్యత తమపై ఉందని, సీఎం రేవంత్‌రెడ్డి ప్రభుత్వం తెలంగాణ ప్రజలకిచ్చిన ఆరు గ్యారంటీలను అమలు చేస్తుందని కాంగ్రెస్ అధినేత్రి సోనియాగాంధీ తెలిపారు. తెలంగాణ ఆవిర్భావ వేడుకలకు అనారోగ్య కారణాల కారణంగా హాజరుకాలేపోయిన సోనియాగాంధీ రాష్ట్ర ప్రజలకు వీడియో సందేశం ద్వారా రాష్ట్ర ఆవిర్భావ శుభాకాంక్షలు తెలిపారు.

తెలంగాణ కోసం అమరులైన వారికి నివాళులర్పించారు 2004లో కరీంనగర్‌లో ఇచ్చిన మాటకు కట్టుబడి ఆనాడు అధికారంలో ఉన్న తాము తెలంగాణ ఏర్పాటు చేశామన్నారు. పదేళ్లలో తెలంగాణ ప్రజలు తనను ఎంతో గౌరవించారని, కాంగ్రెస్ పార్టీ పట్ల ఎంతో అభిమానం చూపారన్నారు. తెలంగాణ ప్రజల, అమరుల ఆకాంక్షలను కాంగ్రెస్ తప్పక నెరవేరుస్తుందన్నారు