Naini Rajender Reddy | నగరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో నగరాల అభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యతనిచ్చిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కొనియాడారు.

Naini Rajender Reddy | నగరాల అభివృద్ధికి రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత : ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి

విధాత, వరంగల్ ప్రతినిధి : రాష్ట్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన 2024-25 బడ్జెట్లో నగరాల అభివృద్ధికి ప్రభుత్వ ప్రాధాన్యతనిచ్చిందని వరంగల్ పశ్చిమ ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి కొనియాడారు. మున్సిపల్,స్మార్ట్ సిటీ, దేవాలయ అభివృద్ధి, సమీకృత మార్కెట్లు, వైకుంఠ దామాలకు నిధులు కేటాయించడం పట్ల సభ ద్వారా ఆయన ధన్యవాదాలు తెలిపారు. అసెంబ్లీలో సమావేశంలో సోమవారం ఆయన ఈ విషయం పై మాట్లాడారు. గతంలో కేటాయించిన నిధులలో 47 శాతం ఖర్చు చేయకుండా ఉన్న స్థితులలో ఈ సారి అదనంగా నిధులు కేటాయించడం చాలా శుభ పరిణామమన్నారు. రామగుండం మున్సిపల్ కార్పొరేషన్ కి రూ.50కోట్లు, ఖమ్మం మున్సిపల్ కి రూ.30 కోట్లు, వరంగల్ స్మార్ట్ సిటీకి రూ.180కోట్లు, కరీంనగర్ స్మార్ట్ సిటీ కి రూ.100కోట్లు, సమీకృత మార్కెట్ల అభివృద్ధి కోసం రూ.100కోట్లు, రాష్ట్రంలో ఉన్న దేవాలయాల అభివృద్ధి కోసం 100కోట్లు, వైకుంఠ దామాలకు రూ.75కోట్లు, పురపాలక సంఘాల రూపకల్పనకు రూ.114కోట్లు కేటాయించినట్లు వివరించారు. ప్రత్యేకంగా హైదరాబాద్ అభివృద్ధి కోసం బడ్జెట్లో 10వేల కోట్లు కేటాయించడం చాలా సంతోషకారమని అన్నారు. గతంలో ప్రజలు ఎదుర్కున్న ఇబ్బందులను ఈ ప్రజా ప్రభుత్వ హయాంలో సరిచేయాల్సిన బాధ్యత ఉందనిమనవి చేశారు. వరంగల్ మహా నగరంలో సగటు మానవుని కలల సౌధమైన ఇళ్ల నిర్మాణంలో గత ప్రభుత్వం తీసుకుని వచ్చిన జీవో కారణం చేత చాలా మంది ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని అన్నారు. వరంగల్ కార్పొరేషన్ పరిధిలో చాలా నాళాలు, చెరువులు, కుంటలు మునిగిపోతున్నాయన్నారు. పార్క్ స్థలంలో అన్యక్రాంతం చేసి బీఆరెస్ పార్టీ కార్యాలయం కట్టారని విమర్శించారు.