సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌కు మరోసారి సాంకేతిక లోపం

సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌ మరోసారి సాంకేతిక లోపానికి గురైంది. బుధవారం సాయంత్రం మెదక్‌ బీఆరెస్‌ ప్రజాశీర్వాద సభలో ప్రసంగించి వెళ్లాల్సిన తరుణంలో హెలి కాప్టర్‌ మొరాయించడంతో పైలట్‌ ప్రయాణానికి నిస్సహాయతను వ్యక్తం చేశాడు.

సీఎం కేసీఆర్‌ హెలికాప్టర్‌కు మరోసారి సాంకేతిక లోపం

విధాత : ముఖ్యమంత్రి కేసీఆర్‌ హెలికాప్టర్‌ మరోసారి సాంకేతిక లోపానికి గురైంది. బుధవారం సాయంత్రం మెదక్‌ బీఆరెస్‌ ప్రజాశీర్వాద సభలో ప్రసంగించి వెళ్లాల్సిన తరుణంలో హెలికాప్టర్‌ మొరాయించింది. దీంతో  పైలట్‌ ప్రయాణానికి నిస్సహాయతను వ్యక్తం చేశాడు.


దీంతో కేసీఆర్‌.. రోడ్డు మార్గంలో హైదరాబాద్ బయలుదేరేందుకు సిద్ధమయ్యారు. అనంతరం కొద్దిసేపటికే సాంకేతిక లోపం సవరించడంతో ముఖ్యమంత్రి హెలికాప్టర్ లోనే హైదరాబాద్‌కు బయల్దేరారు. ఇప్పటికే ఈ ఎన్నికల ప్రచారాలలో కేసీఆర్‌ హెలికాప్టర్‌ సాంకేతిక లోపానికి గురవ్వడం ఇది మూడోసారి కావడం గమనార్హం. మహబూబ్‌నగర్‌, అదిలాబాద్‌, మెదక్‌లలో మూడుసార్లు కేసీఆర్‌ హెలికాప్టర్‌ లో సాంకేతిక సమస్యలు తలెత్తాయి.