మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

మున్సిపల్ చట్టసవరణ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మున్సిపాలిటీల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలుచేసేందుకు వీలుంది. ఆదివారం నాడు మున్సిపల్ చట్ట సవరణ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు.

మున్సిపల్ చట్ట సవరణ బిల్లుకు తెలంగాణ అసెంబ్లీ ఆమోదం

విధాత: మున్సిపల్ చట్టసవరణ బిల్లును తెలంగాణ అసెంబ్లీ ఆమోదం తెలిపింది. మున్సిపాలిటీల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లను అమలుచేసేందుకు వీలుంది. ఆదివారం నాడు మున్సిపల్ చట్ట సవరణ బిల్లును మంత్రి శ్రీధర్ బాబు ప్రవేశపెట్టారు. ఈ బిల్లుకు అసెంబ్లీలో అన్ని పార్టీలు మద్దతు పలికాయి. తొలుత ఈ విషయమై బీఆర్ఎస్ తరపున మాజీ మంత్రి గంగుల కమలాకర్
మాట్లాడారు. ఈ బిల్లుకు మద్దతును ప్రకటించారు. బీజేపీ తరపున పాయల్ శంకర్ మాట్లాడారు.

ఈ బిల్లుకు బీజేపీ సంపూర్ణ మద్దతు ఉంటుందని ఆయన తెలిపారు. ఎంఐఎం కూడా ఈ బిల్లుకు మద్దతు తెలిపింది. ఈ బిల్లుకు ఆమోదం ద్వారా మున్సిపాలిటీల్లో బీసీలకు 42 శాతం రిజర్వేషన్లు అమలు చేసేందుకు అవకాశం ఉంది. బీసీలకు స్థానిక సంస్థల్లో 42 శాతం రిజర్వేషన్లను అమలు చేస్తామని కాంగ్రెస్ హామీ ఇచ్చింది. ఇందులో భాగంగానే ఈ చట్ట సవరణ బిల్లును ప్రవేశపెట్టింది. బీసీలకు 42 శాతం రిజర్వేషన్ల విషయంలో అన్ని పార్టీలు మద్దతు తెలిపాయి.