Bhubharathi| భూభారతి లోగో విడుదల
విధాత: తెలంగాణ ప్రభుత్వం ఎన్నికల హామీ మేరకు ధరణి పోర్టల్ స్థానంలో భూ భారతి పోర్టల్ ను సోమవారం నుంచి అమల్లోకి తెచ్చింది. ముందుగా పైలట్ ప్రాజెక్టుగా మూడు జిల్లాలలోని మూడు మండలాలో భూ భారతీ పోర్టల్ అందుబాటులోకి తెచ్చారు. భూ రిజిస్ట్రేషన్లు, మ్యూటెషన్ల పోర్టల్ భూభారతి లోగోను సీఎం రేవంత్ రెడ్డి ఆవిష్కరించారు.

తెలంగాణలో భూ సమస్యలకు చెక్ పెడుతూ ధరణి పోర్టల్ స్థానంలో భూభారతిని తీసుకొచ్చింది. భూ రిజిస్ట్రేషన్లు, మ్యూటెషన్లు భూ యాజమాన్యంలో స్పష్టత, భద్రత, వేగవంతమైన సేవల కోసం తెలంగాణ ప్రభుత్వం తీసుకొచ్చిన భూ భారతి చట్టం,భూధార్ కార్డులు రైతులకు నూతన శకంగా ప్రభుత్వం చెబుతోంది. ఇది భూ వివాదాలకు ముగింపు పలికే చట్టంగా నిలవనుందని ధీమా వ్యక్తం చేస్తుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram