BRS MLAs Disqualification Hearing | పార్టీ ఫిరాయింపు ఎమ్మెల్యేల అనర్హత కేసుపై స్పీకర్ విచారణ
బీఆర్ఎస్ ఎమ్మెల్యేల పార్టీ ఫిరాయింపు కేసు: అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ విచారణ నిర్వహించారు, బుధవారం మరోసారి విచారణ.
విధాత, హైదరాబాద్ : పార్టీ ఫిరాయింపు అభియోగాలు ఎదుర్కొంటున్న బీఆర్ఎస్ ఎమ్మెల్యేల అనర్హత విచారణ కేసుకు సంబంధించి అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ సోమవారం విచారణ నిర్వహించారు. ఫిరాయింపు ఎమ్మెల్యేలు, వారిపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను స్పీకర్ విచారించారు. విచారణకు ఫిరాయింపు ఎమ్మెల్యే టి. ప్రకాశ్ గౌడ్ తో పాటు ఆయనపై ఫిర్యాదు చేసిన బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల సంజయ్, కాలే యాదయ్య, గూడెం మహిపాల్ రెడ్డిలు…ఫిర్యాదుదారు చింత ప్రభాకర్, బండ్ల కృష్ణమోహన్ రెడ్డి, ఫిర్యాదు దారు పల్లా రాజేశ్వర్ రెడ్డిలు హాజరయ్యారు.
వీరంతా మరోసారి అదే కేసుపై బుధవారం మరోసారి విచారణకు హాజరుకానున్నారు. విచారణ సందర్భంగా పిటిషనర్లు, ప్రతివాదుల తరఫున న్యాయవాదులు..ప్రత్యక్ష వాదనలు వినిపించారు.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram