DSC Exam Results | రేప‌టితో ముగియ‌నున్న డీఎస్సీ ప‌రీక్ష‌లు.. ఈ నెల‌ఖారులో ఫ‌లితాలు విడుద‌ల..!

DSC Exam Results | రాష్ట్రంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఉపాధ్యాయుల( Teachers ) భర్తీ కోసం నిర్వహించే డీఎస్సీ-2024 పరీక్షలు( DSC Exams ) ఆగ‌స్టు 5వ తేదీతో ముగియ‌నున్నాయి. దీంతో డీఎస్సీ రాత‌ప‌రీక్ష ఫ‌లితాల‌ను( DSC Exam Results ) ఈ నెల‌ఖారులోగా విడుద‌ల చేయాల‌ని విద్యాశాఖ అధికారులు( Education Department ) క‌స‌ర‌త్తు చేస్తున్నారు.

DSC Exam Results | రేప‌టితో ముగియ‌నున్న డీఎస్సీ ప‌రీక్ష‌లు.. ఈ నెల‌ఖారులో ఫ‌లితాలు విడుద‌ల..!

DSC Exam Results | హైద‌రాబాద్ : రాష్ట్రంలోని ప్ర‌భుత్వ పాఠ‌శాల‌ల్లో ఉపాధ్యాయుల( Teachers ) భర్తీ కోసం నిర్వహించే డీఎస్సీ-2024 పరీక్షలు( DSC Exams ) ఆగ‌స్టు 5వ తేదీతో ముగియ‌నున్నాయి. దీంతో డీఎస్సీ రాత‌ప‌రీక్ష ఫ‌లితాల‌ను( DSC Exam Results ) ఈ నెల‌ఖారులోగా విడుద‌ల చేయాల‌ని విద్యాశాఖ అధికారులు( Education Department ) క‌స‌ర‌త్తు చేస్తున్నారు. మ‌రో రెండు రోజుల్లో స‌బ్జెక్టుల వారీగా ప్రాథ‌మిక కీని విడుద‌ల చేసి.. అభ్య‌ర్థుల నుంచి అభ్యంత‌రాల‌ను స్వీక‌రించ‌నున్నారు. అనంత‌రం తుది కీని ఫైన‌ల్ చేయ‌నున్నారు. అనంత‌రం జ‌న‌ర‌ల్ ర్యాంకింగ్ జాబితాను విడుద‌ల చేయ‌నున్నారు. ఒక్కో పోస్టుకు ఇద్ద‌రు చొప్పున అభ్య‌ర్థుల‌ను స‌ర్టిఫికెట్ వెరిఫికేష‌న్‌కు పిలిచి అర్హులైన వారికి నియామ‌క ఉత్త‌ర్వులను అంద‌జేయ‌నున్నారు.

మొత్తం 11,062 ఖాళీల భ‌ర్తీకి 2.79 ల‌క్ష‌ల మంది అభ్య‌ర్థులు ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. స్కూల్ అసిస్టెంట్‌(ఎస్ఏ) ఉద్యోగాల‌కు 1.60 ల‌క్ష‌ల మంది, సెకండ‌రీ గ్రేడ్ టీచ‌ర్(ఎస్జీటీ) పోస్టుల‌కు 80 వేల మంది ద‌ర‌ఖాస్తు చేసుకున్నారు. మిగ‌తావారిలో భాషాపండితులు, వ్యాయామ పోస్టుల‌కు చెందిన వారు ఉన్నారు. డీఎస్సీ ప‌రీక్ష‌ల‌ను తొలిసారి కంప్యూట‌ర్ బేస్డ్ విధానంలో నిర్వ‌హించారు. స‌బ్జెక్టుల వారీగా రోజుకు రెండు షిఫ్టుల్లో ప‌రీక్ష‌లు నిర్వ‌హించారు. జులై 18న డీఎస్సీ రాత‌ప‌రీక్ష‌లు కంప్యూట‌ర్ బేస్డ్ విధానంలో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే.