కొత్త కలెక్టర్లు, ఎస్పీల నియామకం.. హైదరాబాద్ సీపీగా శాండిల్య

- అందరూ డైరెక్ట్ రిక్రూటీలే
విధాత : తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో రాష్ట్రంలోని పలువురు ఐఏఎస్, ఐపీఎస్ అధికారులను కేంద్ర ఎన్నికల సంఘం బదిలీ చేసిన సంగతి తెలిసిందే. దీంతో తెలంగాణ ప్రభుత్వం పంపిన ప్యానల్ నుంచి అధికారులను ఈసీ ఎంపిక చేసింది. వాటికి అనుగుణంగా రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. హైదరాబాద్ పోలీస్ కమిషనర్‌గా సీవీ ఆనంద్ స్థానంలో సందీప్ కుమార్ శాండిల్యను నియమించారు.
యాదాద్రి కలెక్టర్‌గా హనుమంత్, నిర్మల్ కలెక్టర్‌గా ఆశీష్ సంగ్వాన్, రంగారెడ్డి కలెక్టర్‌గా భారతీ హోళికేరి, మేడ్చల్ కలెక్టర్‌గా గౌతం, రవాణా శాఖ ముఖ్య కార్యదర్శిగా వాణీ ప్రసాద్, ఎక్సైజ్, వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా సునీల్ శర్మ, ఎక్సైజ్ కమిషనర్‌గా జ్యోతి బుద్ధ ప్రకాశ్, వాణిజ్య పన్నుల శాఖ కమిషనర్‌గా క్రిస్టినా నియమితులయ్యారు. ఈసీ బదిలీ చేయాలని ఆదేశించినవారిలో చాలామంది కాన్ఫర్డ్ అధికారులు ఉండగా.. తాజాగా అందరూ డైరెక్ట్ రిక్రూటీలే కావడం గమనార్హం.
పోలీసు కమిషనర్లు, ఎస్పీల జాబితా..
1. సందీప్‌కుమార్ శాండిల్య – హైదరాబాద్ పోలీస్ కమిషనర్
2. అంబర్ కిశోర్ ఝా – వరంగల్ పోలీస్ కమిషనర్
3. కల్మేశ్వర్ శిగ్వేనావర్- నిజామాబాద్ పోలీస్ కమిషనర్
4. చెన్నూరి రూపేశ్ – సంగారెడ్డి ఎస్పీ
5. సింధూ శర్మ – కామారెడ్డి ఎస్పీ
6. సంప్రీత్ సింగ్ – జగిత్యాల ఎస్పీ
7. హర్షవర్ధన్ – మహబూబ్‌నగర్ ఎస్పీ
8. వైభవ్ రఘునాథ్ – నాగర్‌కర్నూల్ ఎస్పీ
9. రితిరాజ్ – జోగులాంబ గద్వాల్ ఎస్పీ
10. పాటిల్ సంగ్రామ్ సింగ్ గణపతి రావ్ – మహబూబాబాద్ ఎస్పీ
11. యోగేష్ గౌతమ్ – నారాయణపేట ఎస్పీ
12. కిరణ్ ప్రభాకర్ – భూపాలపల్లి ఎస్పీ
13. రాహుల్ హెగ్డే – సూర్యాపేట ఎస్పీ