విధాత, హైదరాబాద్ : తెలంగాణలోని గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఉదయం, మధ్యాహ్నం రెండు సెషన్లలో ఈ పరీక్షలు జరగనున్నాయి.
పేపర్ 1( జనరల్ స్టడీస్ & జనరల్ ఎబిలిటీస్) పరీక్షను డిసెంబర్ 15వ తేదీ మొదటి సెషన్లో, పేపర్ 2 ( హిస్టరీ, పాలిటీ, సొసైటీ) పరీక్షను రెండో సెషన్లో నిర్వహించనున్నారు. పేపర్ 3 (ఎకానమీ అండ్ డెవలప్మెంట్) పరీక్షను 16వ తేదీ మొదటి సెషన్లో, పేపర్ 4 ( తెలంగాణ ఉద్యమం, రాష్ట్ర అవతరణ) రెండో సెషన్లో నిర్వహించనున్నారు. మొదటి సెషన్ ఉదయం 10 గంటల నుంచి 12.30 గంటల వరకు, రెండో సెషన్లో మధ్యాహ్నం 3 గంటల నుంచి 5.30 గంటల వరకు పరీక్ష నిర్వహించనున్నారు.
గతంలో నిర్ణయించిన షెడ్యూల్ మేరకు ఈ ఆగస్టు 7, 8వ తేదీల్లోనే గ్రూప్ 2 పరీక్షలు జరగాల్సి ఉంది. కానీ డీఎస్సీ, గ్రూప్ 2 పరీక్షల మధ్య వారం రోజుల వ్యవధి మాత్రమే ఉండటంతో నిరుద్యోగుల నుంచి తీవ్ర వ్యతిరేకత వచ్చింది. దీంతో వారి డిమాండ్‌కు తలొగ్గిన రాష్ట్ర ప్రభుత్వం గ్రూప్ 2 పరీక్షను వాయిదా వేసింది. తాజాగా ఇప్పుడు పరీక్ష షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ ప్రకటించింది. మొత్తం 783 పోస్టుల భర్తీకి గ్రూప్2 పరీక్ష జరగనుంది.
TGPSC | తెలంగాణ గ్రూప్ 2 షెడ్యూల్ విడుదల.. డిసెంబర్ 15,16తేదీల్లో పరీక్షలు
తెలంగాణలోని గ్రూప్ 2 పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్‌ను టీజీపీఎస్సీ గురువారం విడుదల చేసింది. డిసెంబర్ 15, 16వ తేదీల్లో పరీక్షలు నిర్వహించనున్నట్లు పేర్కొంది.

Latest News
‘ఫీల్ గుడ్’ నుంచి ‘మమ్మా మియా’ పాట విడుదల
విజయ్ దేవరకొండ.. స్టార్ మ్యాజిక్! మిక్స్డ్ టాక్‌తోనూ ‘రణబాలి’కి భారీ వసూళ్లు!
AI Mythological Movie: పురాణాలకు ఏఐ టచ్.. ‘ది ప్రాంప్ట్ వార్’ టైటిల్ ప్రకటన
షార్లెట్‌లో తెలుగు సంబరాలు.. మిషిగన్‌లో నాట్స్
న్యూజెర్సీ నాట్స్‌కు కొత్త నాయకత్వం.. చాప్టర్ లీడర్‌గా సాయి గంగుల
రణబాలి మూవీ రివ్యూ.. విజయ్ దేవరకొండకు కమ్ బ్యాక్ మూవీ అయిందా?
Yash Pan India Movie: యష్‌తో ‘డేవిడ్ రెడ్డి’ దర్శకుడి కాంబినేషన్ నిజమేనా?
ఏపీ మాజీ డిప్యూటీ సీఎం మృతి
ఈనెల 17 న హైదరాబాద్‌లో ఉపరాష్ట్రపతి పర్యటన
విద్యా, పర్యాటక, వైద్య రంగాల్లో కలిసి పనిచేద్దాం.. ప్రిన్స్ రహీమ్ ఆగా ఖాన్-vకు సీఎం విజ్ఞప్తి