IAS Amrapali : తెలంగాణ హైకోర్టులో ఐఏఎస్ ఆమ్రపాలికి చుక్కెదురు
ఐఏఎస్ అధికారి ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమెను తెలంగాణకు కేటాయిస్తూ కేంద్ర పరిపాలనా ట్రిబ్యునల్ (CAT) ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది.
విధాత, హైదరాబాద్ : ఐఏఎస్ ఆమ్రపాలికి తెలంగాణ హైకోర్టులో చుక్కెదురైంది. ఆమ్రపాలిని తెలంగాణకు కేటాయిస్తూ క్యాట్ ఇచ్చిన ఉత్తర్వులపై హైకోర్టు స్టే విధించింది. ఆమ్రపాలికి కౌంటర్ దాఖలు చేయాలని ఆదేశించింది. తదుపరి విచారణను ఆరువారాలకు వాయిదా వేసింది.
ఏపీ కేడర్ కు కేటాయిస్తూ డీవోపీటీ ఆదేశాలను నిలుపుదల చేయాలని ఐఏఎస్ అధికారులు వాకాటి కరుణ, వాణి ప్రసాద్, రొనాల్డ్ రోస్, ఆమ్రపాలి, సృజన, శివశంకర్, హరికిరణ్ గత ఏడాది హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఐఏఎస్ అధికారులతో పాటు డీవోపీటీ తరఫున వాదనలు విన్న కోర్టు వారి పిటిషన్లను డిస్మిస్ చేస్తూ ఉత్తర్వులు వెలువరించింది. ఏపీ కేడర్‌కు కేటాయించిన అధికారులు వెంటనే రిపోర్ట్ చేయాలని ఆదేశించింది. క్యాట్ ఆదేశాలను హైకోర్టు సమర్థించింది.
అభ్యంతరాలు, సమస్యలు ఏవైనా ఉంటే తర్వాత వింటామని ఐఏఎస్ అధికారులకు హైకోర్టు స్పష్టం చేసింది. అధికారులు ముందు వెళ్లి రిపోర్ట్ చేయాలని, కేటాయించిన రాష్ట్రాలకు వెళ్లి రిపోర్ట్ చేసిన తర్వాతే విచారణ చేస్తామని హైకోర్టు తెలిపింది. రిపోర్ట్ చేయకుండా ఏమీ చేయలేమని, ప్రజా సేవ కోసమే పనిచేయాల్సిన ఐఏఎస్ లు ఎక్కడ అవకాశం కల్పిస్తే అక్కడికి వెళ్లాలని హైకోర్టు వ్యాఖ్యానించింది. ట్రిబ్యునల్ కొట్టేస్తే కోర్టులకు రావడం సరికాదని ధర్మాసనం అభిప్రాయపడింది. దీంతో ఆమ్రపాలి సహా వారంతా ఏపీ కేడర్ కు వెళ్లాల్సి వచ్చింది. అక్కడ ఆమ్రపాలి ఏపీ టూరిజం డెవలప్మెంట్ కార్పోరేషన్ ఎండీగా నియామితులయ్యారు. తర్వాత తెలంగాణకు తిరిగి రావాలని కోరుతూ క్యాట్ తీర్పు ఇచ్చింది. క్యాట్ తీర్పుపై తెలంగాణ హైకోర్టు స్టే విధించింది.
ఇవి కూడా చదవండి :
Maoists surrender| లొంగిపోయిన మరో 12 మంది మావోయిస్టులు
Telangana Global Rising Summit 2047| తెలంగాణ గ్లోబల్ రైజింగ్ సమ్మిట్ 2047 ప్రారంభం
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram