Maoists surrender| లొంగిపోయిన మరో 12 మంది మావోయిస్టులు
ఛత్తీస్‌గఢ్‌లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో గల ఖైరాగఢ్ ప్రాంతంలో పలువురు మావోయిస్టులు తమ ఆయుధాలతో సహా పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఎంఎంసీ(మధ్యప్రదేశ్-మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్) జోన్ జోన్ ఇన్‌చార్జ్, మావోయిస్టు కమాండర్ రామ్‌ధేర్ మజ్జీ తన 12 మంది సహచరులతో సహా పోలీసుల సమక్షంలో లొంగిపోయాడు. ఆయనపై రూ.3 కోట్ల రివార్డు ఉంది.
న్యూఢిల్లీ : ఛత్తీస్‌గఢ్( Chhattisgarh)లోని రాజ్‌నంద్‌గావ్ జిల్లాలో గల ఖైరాగఢ్ ప్రాంతంలో పలువురు మావోయిస్టులు(Maoists surrender) తమ ఆయుధాలతో సహా పోలీసుల ఎదుట లొంగిపోయారు. మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడు, ఎంఎంసీ(మధ్యప్రదేశ్-మహారాష్ట్ర-ఛత్తీస్‌గఢ్) జోన్ ఇన్‌చార్జ్, మావోయిస్టు కమాండర్ రామ్‌ధేర్ మజ్జీ( Ramdher Mazzi) తన 12 మంది సహచరులతో సహా పోలీసుల సమక్షంలో లొంగిపోయాడు. ఆయనపై రూ.3 కోట్ల రివార్డు ఉంది. ఎంఎంసీ(మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్) జోన్‌లో ఆయన క్రియాశీలకంగా ఉన్నారు. ప్రస్తుతం ఆయన లొంగుబాటుతో మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, ఛత్తీస్‌గఢ్ సరిహద్దులు నక్సల్స్ రహిత ప్రాంతంగా మారాయని భద్రతా అధికారులు పేర్కొన్నారు. గత ఏడాది బస్తర్ నుండి కేంద్ర కమిటీ సభ్యునిగా నియమితుడైన రెండవ గిరిజన మావోయిస్టు రామ్ ధేర్ కావడం గమనార్హం. హిడ్మాతో పాటు ఈయన కూడా పార్టీలో అంతే గౌరవం దక్కింది. హిడ్మా ఇటీవలే హతం కావడం, ఇప్పుడు రామ్‌ధేర్ లొంగిపోవడంతో బస్తర్‌లోని మావోయిస్టు వ్యవస్థ దాదాపు విచ్ఛిన్నం అయిందని విశ్లేషకులు అంటున్నారు.
లొంగిపోయిన వారిలో నలుగురు డివిజనల్ కమిటీ సభ్యులు (డివిసిఎంలు)చందు ఉసేండి, లలిత, జానకి, ప్రేమ్ ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరిపై రూ. 8 లక్షల బహుమతి ఉంది. అలాగే ఇద్దరు ఏరియా కమిటీ సభ్యులు.. రాంసింగ్ దాదా, సుకేష్ పొట్టం ఉన్నారు. వీరిలో ఒక్కొక్కరిపై రూ. 5 లక్షల బహుమతి ఉంది. మిగిలిన ఐదుగురు కార్యకర్తలు.. లక్ష్మి, షీలా, సాగర్, కవిత, యోగితా.. వీరిలో ఒక్కొక్కరిపై రూ. 2 లక్షల బహుమతి ఉంది. వీరు పోలీసులకు అందించిన మొత్తం 10 ఆయుధాలలో ముఖ్యంగా AK-47లు, INSAS రైఫిల్స్, SLRలు, 303, 30 క్యాలిబర్ కార్బైన్‌లు తరహా అధునాతన ఆయుధాలు ఉన్నాయి.
కొద్ది రోజుల క్రితమే ఎంఎంసీ మావోయిస్టు ప్రతినిధి అనంత్ కూడా తన 10 మంది సహచరులతో పాటు లొంగిపోయిన సంగతి తెలిసిందే.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram