Telangana Liquor Sales | తెలంగాణలో భారీగా మద్యం విక్రయాలు
సెప్టెంబర్‌లో తెలంగాణలో రూ.3,048 కోట్ల మద్యం విక్రయాలు జరగగా, రాబోయే దసరా సీజన్‌లో అమ్మకాలు మరింత పెరిగే అవకాశముంది.

విధాత, హైదరాబాద్ : తెలంగాణ రాష్ట్రంలో లిక్కర్ అమ్మకాలు కొత్త రికార్డు నెలకొల్పాయి. సెప్టెంబర్ నెలలో రూ.3,048 కోట్ల లిక్కర్ అమ్మకాలు జరిగినట్లుగా ఎక్సైజ్ శాఖ వర్గాలు తెలిపాయి. నెల రోజుల్లోనే 30లక్షల కేసుల లిక్కర్.. 36.50వేల బీర్ల కేసుల అమ్మకాలు జరిగాయి. గత ఏడాది సెప్టెంబర్ నెలతో పోలిస్తే ఈ సెప్టెంబర్ నెలలో రూ. 210కోట్లు అదనంగా మద్యం అమ్మకాలు జరిగాయని..నిన్న ఒక్కరోజే రూ. 330 కోట్ల రూపాయల అమ్మకాలు జరిగాయని వెల్లడైంది.
ఈ లెక్కన దసరా, స్థానిక సంస్థల ఎన్నికల నేపథ్యంలో ఆక్టోబర్ నెలలో మరింత అధికంగా మద్యం అమ్మకాలు జరుగవచ్చని అంచనా వేస్తున్నారు. అలాగైతే ప్రభుత్వ ఖజానాకు లిక్కర్ ఆదాయం దండిగా లభిస్తుందని భావిస్తున్నారు. గత ఏడాది 2024 చివరి నెల డిసెంబర్‌లో మద్యం అమ్మకాలు రికార్డ్ స్థాయిలో జరిగాయి. డిసెంబర్ 1 నుంచి 31 వరకు దాదాపు రూ.3,805 కోట్ల విలువైన మద్యం అమ్మకాలు సాగాయి. ఈ రికార్డు ఆక్టోబర్ మాసం అమ్మకాలు అధిగమించే అవకాశం కనిపిస్తుంది.