తెలంగాణలో పోలీస్ రిక్రూట్‌మెంట్‌కు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకునేందుకు ప్రభుత్వం తేదీలు ప్రకటించింది. ఆగస్టు 19 నుంచి సెప్టెంబర్ 9 వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తులు స్వీకరించనున్నట్లు తెలిపింది. గత వారం తెలంగాణ ప్రభుత్వం 7,437 పోస్టు భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే. దరఖాస్తులను www.tgprb.in, http://www.tgprb.in ద్వారా మాత్రమే స్వీకరిస్తున్నట్లు వెల్లడించింది. ఎస్సై పోస్టులకు 750 (ఎస్సీ/ఎస్టీ), 1,500 ఇతరులకు ఫీజు ఉంటుందని తెలంగాణ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డు ప్రకటించింది.
పోలీస్ కానిస్టేబుల్ (సివిల్) – 3,697, పోలీస్ కానిస్టేబుల్ (AR) – 1,052, పోలీస్ కానిస్టేబుల్ (SAR CPL) (పురుషులు) – 24, తెలంగాణ స్పెషల్ ప్రొటెక్షన్ ఫోర్స్ శాఖ కానిస్టేబుల్ – 1,380, తెలంగాణ అగ్నిమాపక, విపత్తు నిర్వహణ & పౌర రక్షణ శాఖ ఫైర్ ఫైటర్ – 751, తెలంగాణ జైళ్లు & సంస్కరణ సేవల శాఖ వార్డర్ (పురుషులు) – 196, వార్డర్ (మహిళలు) – 12 పోస్టులకు నోటిఫికేషన్ జారీ చేసిన సంగతి తెలిసిందే.