రేషన్ కార్డుల ఈ – కేవైసీ గడువు ఆగస్టు 31వరకు పొడిగింపు

తెలంగాణలో రేషన్ కార్డుల ఈ-కేవైసీ గడువును ఆగస్టు 31 వరకు పొడిగించారు. మూడు నెలల రేషన్ పంపిణీని ప్రారంభించిన ప్రభుత్వం, పోర్టబులిటీ ద్వారా ఏ దుకాణం నుంచైనా రేషన్ పొందవచ్చని వెల్లడించింది.

తెలంగాణలో రేషన్‌కార్డుల ఈ-కేవైసీ గడువును ఆగస్టు 31వరకు పొడిగించారు. రేపట్నుంచి రేషన్ దుకాణాలలో 3 నెలల రేషన్‌ను పంపిణీ చేయనున్నారు. ఆగస్టు 31 వరకు మూడు నెలల రేషన్‌ తీసుకోవచ్చని ప్రభుత్వం వెల్లడించింది. అలాగే పోర్టబులిటీ ద్వారా ఏ దుకాణం నుంచైనా రేషన్‌ పొందవచ్చని పౌరసరఫరాల శాఖ పేర్కొంది.

ఈ-కేవైసీకి జూలై 31 ఆఖరి రోజు కావడంతో ఈ-కేవైసీ పూర్తికాకుంటే నిత్యావసర సరకులు అందే అవకాశం లేదని పౌర సరఫరాల శాఖ అధికారులు స్పష్టం చేస్తుండటంతో కార్డుదారులు ఆందోళన చెందుతున్నారు. నగరంలో ఇంకా చాలా కుటుంబాలు ఈ కేవైసీ పూర్తిచేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో ఈ కేవైసీ గడువును పెంచినట్లు ప్రభుత్వం ప్రకటించడంతో రేషన్ కార్డుదారులకు ఊరట లభించింది.

Latest News