ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీకి కేంద్రం నిర్ణయం

రేషన్ కార్డుదారులకు కేంద్రం బంపర్ ఆఫర్! ఏప్రిల్, మే, జూన్ నెలలకు సంబంధించి మూడు నెలల ఉచిత రేషన్‌ను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయం.

ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీకి కేంద్రం నిర్ణయం

విధాత : మరోసారి కేంద్రం ఒకేసారి మూడు నెలల రేషన్ సరుకులను ఒకేసారి పంపిణీ చేయాలని నిర్ణయించినట్లుగా సమాచారం. ప్రధాన మంత్రి గరీబ్ కళ్యాణ్ అన్న యోజన (PMGKAY) కింద రేషన్ కార్డు లబ్ధిదారులకు మూడు నెలల రేషన్ అనగా ఏప్రిల్, మే, జూన్ 2026 నెలలకు సంబంధించి ఉచితంగా ఇచ్చే రేషన్‌ను ఒకేసారి ఇవ్వాలని కేంద్రం నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్రాలకు, ఆహార, ప్రజాపంపిణీ శాఖలకు ఆదేశాలు జారీ చేసినట్లుగా తెలుస్తుంది. కేంద్ర నిల్వల నుంచి వెంటనే ధాన్యం తీసుకుని సమయానికి పంపిణీ చేయాలని ఆదేశించింది. దీనిపై ఈ నెలాఖరులోగా లబ్ధిదారులకు సమాచారం అందించనునుంది.

పశ్చిమాసియా యుద్ద పరిస్థితులు, రాబోయే మూడు నెలల్లో ఎండల తీవ్రత, గోదాములలో నిల్వలు పేరుకుపోవడం వంటి కారణాల మధ్య కేంద్రం ఒకేసారి మూడు నెలల రేషన్ పంపిణీకి నిర్ణయించింది. గత వర్షాకాలంలోనూ కేంద్రం ఇదే రకంగా మూడు నెలల రేషన్ ఒకేసారి పంపిణీ చేయడం గమనార్హం.

ఇవి కూడా చదవండి :

తెలంగాణకు ప్రధాని మోదీ రాక.. గ్రేటర్ ఎన్నికలే టార్గెట్ !
Arunachala Moksha Yatra | ఆధ్యాత్మికం.. ఆహ్లాదం.. రూ.10వేల లోపే ఐఆర్‌సీటీసీ అరుణాచల మోక్ష యాత్ర!