Indiramma Housing Scheme | ఇందిర‌మ్మ ఇండ్ల‌కు రేష‌న్ కార్డు త‌ప్ప‌నిస‌రి కాదు.. మంత్రి పొంగులేటి కీల‌క ప్ర‌క‌ట‌న‌

Indiramma Housing Scheme | రేష‌న్ కార్డు( Ration Card ) లేక‌పోయినా మొద‌టి విడుత‌లో పేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇండ్లు( Indiramma Housing Scheme ) మంజూరు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్టు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) స్ప‌ష్టం చేశారు.

Indiramma Housing Scheme | ఇందిర‌మ్మ ఇండ్ల‌కు రేష‌న్ కార్డు త‌ప్ప‌నిస‌రి కాదు.. మంత్రి పొంగులేటి కీల‌క ప్ర‌క‌ట‌న‌

Indiramma Housing Scheme | ఖ‌మ్మం : రేష‌న్ కార్డు( Ration Card ) లేక‌పోయినా మొద‌టి విడుత‌లో పేద‌ల‌కు ఇందిర‌మ్మ ఇండ్లు( Indiramma Housing Scheme ) మంజూరు చేయాల‌ని ప్ర‌భుత్వం నిర్ణ‌యించిన‌ట్టు రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి( Ponguleti Srinivas Reddy ) స్ప‌ష్టం చేశారు. ఖ‌మ్మం జిల్లా కూసుమంచిలోని క్యాంప్ కార్యాల‌యంలో సోమ‌వారం నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని తిరుమ‌లాయ‌పాలెం మండ‌లం కాంగ్రెస్ శ్రేణులు, అధికారుల సంయుక్త స‌మావేశం నిర్వ‌హించారు.

ఈ స‌మావేశం అనంత‌రం పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి మాట్లాడుతూ.. మొద‌టి విడ‌త‌లో పేద‌లు, నిరుపేద‌ల విభాగాలుగా ప‌రిశీలించి ఇండ్లు మంజూరు చేస్తామ‌ని స్ప‌ష్టం చేశారు. రెండో విడ‌త నుంచి మాత్రం రేష‌న్ కార్డును ప్రామాణికంగా తీసుకుంటామ‌న్నారు. కాబ‌ట్టి త్వ‌ర‌లోనే రేష‌న్ కార్డుల జారీ ప్ర‌క్రియ ప్రారంభం అవుతుంద‌ని తెలిపారు.

అర్హులు ఎవ‌రంటే..?

ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థ‌కంలో భాగంగా ప్ర‌తి నియోజ‌క‌వ‌ర్గంలో 3500 ఇండ్ల చొప్పున రాష్ట్ర వ్యాప్తంగా 4,50,00 ఇండ్లు నిర్మించాల‌ని రాష్ట్ర ప్ర‌భుత్వం ల‌క్ష్యంగా పెట్టుకున్న‌ది. ఈ ప‌థ‌కం కేవ‌లం దారిద్య్ర‌ రేఖ‌కు దిగువ‌( BPL )న ఉన్న కుటుంబాల‌కు మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. అంటే తెల్ల రేష‌న్ కార్డు( White Ration Card ) ఉన్న‌వారికి మాత్ర‌మే వ‌ర్తిస్తుంది. అది కూడా మ‌హిళ‌ల పేరు మీద‌నే ఇల్లు మంజూర‌వుతుంది. సొంత జాగ ఉండి కిరాయి ఇండ్ల‌లో కానీ, క‌చ్చా ఇండ్ల‌లో కానీ నివ‌సిస్తున్న వారు ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థ‌కానికి అర్హులు. గ్రామ‌స‌భ‌ల్లో ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థ‌కం ల‌బ్దిదారుల‌ను గుర్తించ‌నున్నారు. అయితే తొలి విడుత‌లో మాత్రం రేష‌న్ కార్డు లేకున్నా.. అర్హుల‌కు ఇండ్లు మంజూరు చేస్తామ‌ని మంత్రి పొంగులేటి ప్ర‌క‌టించారు.

కొత్త ఇంటి నిర్మాణానికి రూ. 5 ల‌క్ష‌లు..

ఇందిరమ్మ ఇండ్ల పథకంలో ఇంటి స్థలం ఉన్న వారికి అదే స్థలంలో కొత్త ఇంటి నిర్మాణం కోసం రూ. 5 లక్షలు ఇస్తారు. స్థలం లేని నిరుపేదలకు ఇంటి స్థలంతోపాటు రూ. 5 లక్షలు ఇస్తారు.

ఇంటి నిర్మాణానికి నిధుల మంజూరు ఇలా..

గ‌త కేసీఆర్ ప్ర‌భుత్వం నిర్మించిన డ‌బుల్ బెడ్రూం( Double Bed Room Houses ) అపార్ట్‌మెంట్ల మాదిరిగా కాకుండా.. లబ్ధిదారుల సొంత జాగాలో మెుత్తం 4 దశల్లో ఈ ఇండ్ల నిర్మాణాలు పూర్తి చేయనున్నారు. కనీసం 400 చదరపు అడుగుల వైశాల్యంలో స్లాబు నిర్మా ణం, అందులో వంటగది( Kitchen ), మరుగుదొడ్డి తప్పనిసరిగా నిర్మించుకోవాల‌ని అధికారులు సూచిస్తున్నారు. పునాదులు పూర్తయ్యాక లక్ష, రూఫ్‌ లెవల్‌కి వచ్చాక మరో లక్ష, స్లాబ్‌ వేశాక రూ. 2 లక్షలు, మొత్తం పూర్తయ్యాక మిగిలిన లక్ష చొప్పున లబ్ధిదారుల బ్యాంకు ఖాతాలో జమ అవుతుంది.

ఏయే ధృవ‌ప‌త్రాలు అవ‌స‌రం..?

ఇందిర‌మ్మ ఇండ్ల ప‌థ‌కానికి మ‌హిళ‌ల‌ను ప్రామాణికంగా చేయ‌నున్నారు. కాబ‌ట్టి స‌ద‌రు మ‌హిళ‌కు సంబంధించిన ఆధార్ కార్డు, బ్యాంకు పాస్ బుక్( Bank Pass Book ), పాస్‌పోర్ట్ సైజు ఫొటోలతో పాటు ఇత‌ర ధృవీక‌ర‌ణ ప‌త్రాల‌ను అడిగే అవ‌కాశం ఉంటుంది. త‌ప్ప‌నిస‌రిగా ఆ కుటుంబానికి సంబంధించిన తెల్ల రేష‌న్ కార్డు( White Ration Card )ను కూడా స‌మ‌ర్పించాల్సి ఉంటుంది. ఎందుకంటే తెల్ల రేష‌న్ కార్డు ఉన్న కుటుంబాల‌కే ఈ ప‌థ‌కాన్ని వ‌ర్తింప‌జేయ‌నున్న‌ట్లు ప్ర‌భుత్వం ఇప్ప‌టికే అధికారికంగా ప్ర‌క‌టించింది.