School Holidays | తెలంగాణలో స్కూళ్లకు వరుసగా మూడు రోజులు సెలవులు!
రాష్ట్రంలోని విద్యార్థులు, తల్లిదండ్రులకు అలర్ట్.. తెలంగాణలో పాఠశాలలకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి.

School Holidays | రాష్ట్రంలోని విద్యార్థులు, తల్లిదండ్రులకు అలర్ట్.. తెలంగాణలో పాఠశాలలకు వరుసగా మూడు రోజుల పాటు సెలవులు రానున్నాయి. జూలై 19 (శనివారం) నుంచే ఈ సెలవులు ప్రారంభం కానున్నాయి. జూలై 19 నుంచి 21 వరకు వరుసగా 3 రోజులు సెలవులు ఉండనున్నాయి. జూలై19న శనివారం కావడంతో చాలా స్కూళ్లకు హాఫ్ డే వర్కింగ్ ఉండగా ఫస్ట్ క్లాస్ పిల్లలకు శనివారం సెలవు ఉంటుంది. జూలై 20 ఆదివారం కావడంతో సాధారణ సెలవు ఉంటుంది. ఇక జూలై21 న బోనాల పండుగ నేపథ్యంలో తెలంగాణలోని ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాలలకు సర్కార్ సెలవు ఇప్పటికే సెలవు ప్రకటించింది. ప్రస్తుతం రాష్ట్రంలో బోనాలు ఉత్సవాలు జరుగుతున్నాయి. గత ఆదివారం సికింద్రబాద్ ఉజ్జయిని మహంకాళీ బోనాలు ఘనంగా జరిగాయి. తెలంగాణ ప్రభుత్వం బోనాలను అధికారిక పండుగగా ప్రకటించడంతో సెలవు ఉంటుంది.
రాష్ట్ర ప్రభుత్వం విడుదల చేసిన 2025 సెలవుల జాబితాలో బోనాలను హాలిడేగా ప్రకటించారు. దీంతో బోనాల రోజు ఆప్షనల్ హాలీడే కాకుండా సాధారణ సెలవుగా ప్రకటించారు. దీంతో తెలంగాణలోని అన్ని ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థలు తప్పనిసరిగా మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలిచ్చింది. దీంతో రాష్ట్రంలో విద్యాసంస్థలన్నింటికీ జూలై 21 సోమవారం సెలవు ఉండనుంది. శనివారం నుంచి వరుసగా మూడు రోజులు హాలీడేస్ రావడంతో విద్యార్థులు ఖుష్ అవుతుండగా.. తల్లిదండ్రులకు మాత్రం పెద్ద పరీక్షే అని చెప్పొచ్చు. అలాగే జూలై 23న కూడా రాష్ట్రంలోని విద్యాసంస్థలకు సెలవు ఉండనుందనే వార్తలు వస్తున్నాయి. దీనికి కారణం 23న వామపక్ష విద్యార్థి సంఘాలు రాష్ట్ర వ్యాప్తంగా బంద్ కు పిలుపునివ్వడమే కారణం. తెలంగాణ విద్యారంగంలో నెలకొన్న సమస్యల పరిష్కారం కోసం బంద్ కు పిలుపునిచ్చారు. దీంతో 23న బుధవారం కూడా సెలవు ఉండనుందని తెలుస్తోంది.