TG EAPCET | టీజీ ఎప్‌సెట్ దరఖాస్తులు.. ఉదయం 11.30 నుంచి ఆన్‌లైన్‌లో స్వీకరణ
TG EAPCET | రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం టీజీ ఎప్‌సెట్( TG EAPCET ) పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వెలువడింది.
TG EAPCET | రాష్ట్రంలోని ఇంజినీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కాలేజీల్లో ప్రవేశాల నిమిత్తం టీజీ ఎప్‌సెట్( TG EAPCET ) పరీక్ష నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఇందుకు సంబంధించిన నోటిఫికేషన్ కూడా వెలువడింది. అర్హత గల విద్యార్థులు నేటి నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే 19వ తేదీన ఉదయం 11.30 గంటల నుంచి ఆన్‌లైన్‌లో దరఖాస్తులు అందుబాటులో ఉంటాయని ఎప్‌సెట్ కన్వీనర్ డాక్టర్ కే విజయ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
అమ్మాయిలకు శుభవార్త..
పరీక్షా కేంద్రాల విషయంలో అమ్మాయిలకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నట్టు కన్వీనర్ తెలిపారు. అమ్మాయిలు దరఖాస్తులో సూచించిన అడ్రస్‌కు సమీపంలోనే పరీక్షా కేంద్రాలను కేటాయిస్తామన్నారు. ఈసారి అమ్మాయిలు దూరం ప్రయాణించాల్సిన అవసరం లేదన్నారు. ఒక జిల్లాలోని అమ్మాయిలకు ఇతర జిల్లాల్లో పరీక్షా కేంద్రాలు కేటాయించబోమని స్పష్టం చేశారు.
రిజిస్ట్రేషన్ ఫీజు ఎంతంటే..?
ఓపెన్ కేటగిరి అభ్యర్థులకు రూ. 900 కాగా, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్ అభ్యర్థులకు రూ. 500గా నిర్ణయించారు. ఈసారి స్మార్ట్ ఫోన్‌లో దరఖాస్తు చేసుకునే విధంగా వెసులుబాటు కల్పించామని కన్వీనర్ పేర్కొన్నారు.
టీజీ ఎప్‌సెట్ ముఖ్యమైన తేదీలు
టీజీ ఎప్‌సెట్ నోటిఫికేషన్ విడుదల – ఫిబ్రవరి 14
ఆన్‌లైన్‌లో దరఖాస్తుల స్వీకరణ – ఫిబ్రవరి 19 నుంచి ఏప్రిల్ 4 వరకు
అగ్రికల్చర్, ఫార్మసీ పరీక్షల నిర్వహణ – మే 4, 5 తేదీల్లో
ఇంజినీరింగ్ పరీక్షల నిర్వహణ – మే 9 నుంచి 11 వరకు
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram