Mega Job Mela | హైదరాబాద్ : హైదరాబాద్ నగరం మరోసారి మెగా జాబ్ మేళాకు వేదిక కానుంది. ఈ మెగా జాబ్ మేళాను తెలంగాణ మైనార్టీస్ ఫైనాన్స్ కార్పొరేషన్ (TGMFC) జూన్ 9వ(మంగళవారం) నిర్వహించేందుకు సిద్ధమైంది. నాంపల్లిలోని రెడ్ రోజ్ ప్యాలెస్‌లో నిర్వహించనున్నట్లు టీజీఎంఎఫ్‌సీ చైర్మన్ మహ్మద్ ఒబెదుల్లా కొత్వాల్ ప్రకటించారు.
మైనార్టీ వర్గాల్లోని నిరుద్యోగ యువతకు ఉద్యోగ, ఉపాధి అవకాశాలు కల్పించేందుకే ఈ మెగా జాబ్ మేళాను నిర్వహిస్తున్నట్లు పేర్కొన్నారు. మైనార్టీ నిరుద్యోగ యువత మాత్రమే జాబ్ మేళాకు హాజరు కావాలని సూచించారు. మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రి అజారుద్దీన్ చేతుల మీదుగా జాబ్ మేళా ప్రారంభం కానుంది.
టెక్నాలజీ, బ్యాంకింగ్, ఫైనాన్స్, హెల్త్ కేర్, మాన్యుఫ్యాక్చరింగ్, లాజిస్టిక్స్, హాస్పిటాలిటీ, కస్టమర్ సర్వీసెస్ వంటి రంగాలకు చెందిన 40 నుంచి 50 కంపెనీలు.. అర్హులైన వారిని ఎంపిక చేసుకోనున్నారు. జాబ్‌మేళాకు హాజరయ్యే నిరుద్యోగ యువత తప్పనిసరిగా తమ ఒరిజినల్ సర్టిఫికెట్లతో హాజరు కావాలని సూచించారు.
