• Telugu News
  • /Telangana

CM Revanth Reddy | సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ 9న ఏర్పాటు..పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం నాడు విగ్రహ విగ్రహ ఏర్పాటు కోసం సెక్రటేరియట్ ఆవరణను పరిశీలించారు

Reported by: Subbu | తెలంగాణ‌ | Aug 20, 2024, 5:50 pm IST
Read Time: 2 mins
CM Revanth Reddy | సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహం డిసెంబర్ 9న ఏర్పాటు..పరిశీలించిన సీఎం రేవంత్ రెడ్డి

విధాత: సెక్రటేరియట్ లో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నిర్ణయించారు. ఈ మేరకు మంగళవారం నాడు విగ్రహ విగ్రహ ఏర్పాటు కోసం సెక్రటేరియట్ ఆవరణను పరిశీలించారు. డిసెంబర్ 9 వ తేదీన సచివాలయం ఆవరణలో తెలంగాణ తల్లి విగ్రహాన్ని ఏర్పాటు చేస్తామని సీఎం రేవంత్ రెడ్డి గతంలోనే ప్రకటించారు. రాజీవ్ గాంధీ జయంతి వేడుకలలో మరోసారి తెలంగాణ తల్లి విగ్రహ ఏర్పాటు అంశాన్ని సీఎం ప్రస్తావించారు. ఇందులో భాగంగా తెలంగాణ తల్లి విగ్రహం ఏర్పాటుకు సచివాలయ ఆవరణను సీఎం పరిశీలించారు. విగ్రహ ఏర్పాటు స్థలం, ఏరియా డిజైన్ ప్రణాళికలపై అధికారులతో చర్చించారు. తెలంగాణ సంస్కృతిని ప్రతిబింబించేలా తెలంగాణ తల్లి విగ్రహం ఉండాలని సీఎం సూచించారు.సచివాలయంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారిని మర్యాదపూర్వకంగా కలిసిన నూతన ఎమ్మెల్సీలు ప్రొఫెసర్ కోదండరాం, అమీర్ అలీ ఖాన్